Vijay 69 : ‘దళపతి 69’లో పూజా హెగ్డేకు ఛాన్స్

Vijay 69 : ‘దళపతి 69’లో పూజా హెగ్డేకు ఛాన్స్

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా హెచ్ వినోద్ తెరకెక్కించనున్న ‘దళపతి 69’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో పూజా హెగ్డే నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ దీనికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘బీస్ట్’ మూవీ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. దీనికి అనిరుధ్ మ్యూజిక్ అందించనుండగా వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్‌ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌ నటిస్తున్నారు.

ఇటీవలే ది గోట్‌ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. సెప్టెంబర్‌ 5న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ. 400 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోనూ సందడి చేయనుంది. ఈ నెల 3వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్ తన చివరి చిత్రం ‘దళపతి 69’ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’కి ఈ చిత్రం రీమేక్ అని కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌తో పాటు ఆడపిల్లలను పేరెంట్స్ ఎలా పెంచాలనే మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రమైతే సేఫ్ సైడ్ అని విజయ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటనేమీ రాలేదు.

Tags

Next Story