Pooja Hegde : పూజా హెగ్డే ఆఫర్ మిస్ కాలేదు

గుంటూరు కారం మిస్ అయిన దగ్గర నుంచి పూజాహెగ్డేకు మళ్లీ తెలుగు సినిమా ఆఫర్ రాలేదు. మధ్యలో కొన్ని వచ్చాయి అన్నారు. మిస్ అయ్యాయి. రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ సరసన ఓ ఆఫర్ వచ్చింది. రవి నేలకుడితి అనే కొత్త దర్శకుడు రూపొందించే సినిమా ఇది. ఎస్ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై నిర్మాణం అవుతుంది. దుల్కర్ సల్మాన్ చేస్తోన్న మరో స్ట్రెయిట్ తెలుగు మూవీ ఇది. ఈ చిత్రంలోనే హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్నారు అని వినిపించింది. బట్ తర్వాత పూజాను తొలగించారు. మరో హీరోయిన్ ను తీసుకున్నారు అనే న్యూస్ వచ్చాయి.
బట్ పూజా హెగ్డేను తొలగించలేదు. ఈ చిత్రంలో తనే హీరోయిన్. తాజాగా ఆమె ఈ ప్రాజెక్ట్ లో అడుగుపెట్టింది. తనపై షూట్ చేసిన కొన్ని షాట్స్ ను విడుదల చేస్తూ పూజాకు వెల్కమ్ చెప్పింది టీమ్. ఈ వీడియో చూస్తుంటే మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ లా ఈ చిత్రం ఉండబోతోందని అర్థం అవుతోంది. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకునేలా ఉంది. దుల్కర్ సినిమా అంటే షూటింగ్ ఏమంత ఆలస్యం కాదు. చాలా త్వరగానే ఫినిష్ చేస్తాడు. సో.. నెక్ట్స్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోనే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి. మరి ఈ మూవీ హిట్ అయితే పూజాకు మళ్లీ తెలుగులో డిమాండ్ స్టార్ట్ అవుతుందేమో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com