Pooja Hegde : రెట్రో పూజాహెగ్డేకు రీ ఎంట్రీ ఇప్పిస్తుందా..?

తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన బ్యూటీ పూజా హెగ్డే. గుంటూరు కారం మూవీ నుంచి తనను తీసేసిన తర్వాత సడెన్ గా డల్ అయింది. ఒకప్పుడు ఆఫర్స్ తో ఉక్కిరిబిక్కిరైన ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్సే లేకుండా పోవడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. మధ్యలో ఫలానా మూవీ వచ్చింది అనే న్యూస్ వచ్చాయి తప్ప నిజం కాదు. దీంతో మకాం కోలీవుడ్ కు మార్చింది. అక్కడ సూర్య సరసన బంపర్ ఆఫర్ పట్టేసింది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే 1న విడుదల కాబోతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అయినా.. ఈ మూవీలో పూజాహెగ్డే గ్లామర్ రోల్ లో కాకుండా నటనకు బలమైన ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసిందని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. మరోవైపు రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ మూవీ కూలీలో ఓ ఐటమ్ సాంగ్ చేసింది. ఈ పాట సినిమాకు కొత్త ఊపు తెస్తుందంటున్నారు.
ఇక తెలుగులో రెట్రో మూవీ ప్రమోషన్స్ ను పూజాతో ప్రారంభించింది టీమ్. ఈ ప్రమోషన్స్ లో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తోంది పూజా. త్వరలోనే తెలుగులో ఓ లవ్ స్టోరీ చేయబోతున్నా అని చెప్పింది. కానీ అందులో ఎంత నిజం ఉందనేది తెలియదు. అయితే రెట్రో తర్వాత మళ్లీ తనకు తెలుగులోనూ ఆఫర్స్ వస్తాయని చెబుతున్నారు. ఈ మేరకే తను తమిళ్ కంటే ప్రమోషన్స్ పరంగా తెలుగులో ఎక్కువగా ఫోకస్ చేసిందంటున్నారు. నిజానికి పూజాహెగ్డే సడెన్ గా ఎందుకు డల్ అయిందనేది ఎవరికీ అర్థం కాలేదు. ఏదేమైనా రెట్రో సూపర్ హిట్ అయితే తనకు తెలుగు నుంచి మళ్లీ ఆఫర్స్ మొదలవుతాయి అనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com