Pooja Hegde: మల్టీ స్టారర్ సినిమాలో పూజా హెగ్డే ఐటెమ్ సాంగ్.. భారీ రెమ్యునరేషన్ డిమాండ్..

Pooja Hegde (tv5news.in)
Pooja Hegde: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ టాప్ ప్లేస్‌కు దూసుకుపోతోంది పూజా హెగ్డే. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా చిత్రాల్లో చోటు దక్కించుకుంటోంది పూజా. ఇక వరుస ఆఫర్లతో ఇంత బిజీగా ఉన్న సమయంలో కూడా పూజా ఓ ఐటెమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కానీ దానికోసం భారీ రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేస్తు్న్నట్టు టాక్.
పూజా.. ప్రభాస్‌తో కలిసి నటించిన 'రాధే శ్యామ్' సినిమా ఇటీవల విడుదలయ్యి తన యాక్టింగ్‌కు మంచి మార్కులు పడేలా చేసింది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన 'బీస్ట్'తో పూజా కోలీవుడ్‌లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక బీస్ట్ సినిమాలో పూజా గ్లామర్‌కు, డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతలోనే పూజాకు ఓ మల్టీ స్టారర్ సినిమాలో ఐటెమ్ సాంగ్ ఛాన్స్ వచ్చిందని టాక్.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'ఎఫ్ 2' సినిమాకు సీక్వెల్‌గా 'ఎఫ్ 3' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ కోసం పూజాను సంప్రదించగా.. తాను రూ.కోటిన్నర రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఫైనల్‌గా మేకర్స్ తనను రూ.1 కోటికి ఒప్పించినట్టు టాక్. ఇప్పటికే 'రంగస్థలం'లో జిగేలు రాణిగా మెప్పించింది పూజా హెగ్డే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com