Pooja Hegde : పూజాహెగ్డేకు మరో బంపర్ ఆఫర్

జిగేల్ రాణి పూజా హెగ్డే తెలుగు నుంచి సడెన్ గా మాయమైంది. ఉన్నట్టుండి తనకు ఆఫర్స్ తగ్గాయి. అంతకు ముందు తనే టాప్ హీరోయిన్ గా వెలుగుతోంది. గుంటూరు కారం నుంచి తను తప్పుకున్న తర్వాత మరో కొత్త ఆఫర్ పట్టలేకపోయింది. ఇందుకు రకరకాల కారణాలున్నాయి. ఈ గ్యాప్ లో హిందీ సినిమాలపై ఫోకస్ చేసింది. ఎప్పట్లానే అక్కడ వర్కవుట్ కాలేదు. ఇటు తమిళ్ నుంచి సూర్య సరసన సూపర్ ఆఫర్ వచ్చింది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ రెట్రో మూవీ మే 1న విడుదల కాబోతోంది. ఆల్రెడీ తెలుగులో ప్రమోషన్స్ మొదలుపెట్టింది పూజా. ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో భాగంగా తను త్వరలోనే తెలుగులో ఓ లవ్ స్టోరీ చేయబోతున్నా అని చెప్పింది. మరి ఆ మూవీలో హీరో ఎవరో తెలుసా..?
దుల్కర్ సల్మాన్ ఓ సినిమా కమిట్ అయ్యాడు అంటే కథ అదిరిపోయింది అని అర్థం. అలాంటి దుల్కర్ సరసనే పూజాహెగ్డే ఓ సినిమా చేయబోతోంది. తెలుగులోనే రూపొందబోతోన్న ఈ చిత్రాన్ని రవి అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇతను గతంలో దర్శకుడు పరశురామ్ వద్ద సర్కారువారి పాట చిత్రానికి అసిస్టెంట్ గా పనిచేశాడు.
విశేషం ఏంటంటే.. దుల్కర్ తో పూజాహెగ్డే ఇంతకు ముందే ‘సీతారామం’లో నటించాల్సి ఉంది. అప్పుడు కుదర్లేదు. ఈ సారి సెట్ అయింది. అయితే అప్పుడూ ఇప్పుడూ ప్రేమకథలే కావడం మరో విశేషం. మరి ఈ మూవీతో పూజాహెగ్డే టాలీవుడ్ లో బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com