Pooja Hegde : బిల్లా రంగాతో పూజాహెగ్డే

2023 నుంచి తెలుగులో ఏ సినిమా చేయలేదు పూజాహెగ్డే. అంతకు ముందు ఇక్కడ తను టాప్ హీరోయిన్. సడెన్ గా తన ఆఫర్స్ తగ్గిపోయాయి. అందుకు కారణాలేవైనా ప్రస్తుతం తన కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది. మెల్లగా కోలీవుడ్ లో రైజ్ అవుతోంది. అక్కడ సూర్య సరసన ‘రెట్రో’మూవీలో నటించింది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే 1న విడుదల కాబోతోంది. ఈ సారి గ్లామర్ రోల్ తో కాకుండా పూర్తిగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో కాస్త డీ గ్లామర్ రోల్ తో వస్తున్నట్టు టీజర్, ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. రెట్రో రిజల్ట్ ఏదైనా తన పాత్రకు మంచి గుర్తింపు రావడం ఖాయం అంటున్నారు.
ఇక రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన కూలీలోనూ ఓ ఐటమ్ సాంగ్ తో పాటు ఓ పాత్ర కూడా చేసింది. మరోవైపు మళ్లీ తెలుగులోనూ కొత్త ఆఫర్ దక్కించుకుందనే వార్తలు వస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించబోతోన్న ఓ లవ్ స్టోరీలో పూజాహెగ్డేను తీసుకున్నారు అంటున్నారు. పేర్లు చెప్పలేదు కానీ ఈ విషయాన్ని పూజా కూడా ఒప్పుకుంది.
ఇక లేటెస్ట్ గా అమ్మడి స్టెప్ శాండల్ వుడ్ లో పడబోతోందనే వార్తలు వస్తున్నాయి. హిందీతో మొదలై, తెలుగులో టాప్ స్టార్ అయి, కోలీవుడ్ లో రైజ్ అవుతోన్న ఈ జిగేల్ రాణి ఇక శాండల్ వుడ్ లో కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.అక్కడి టాప్ స్టార్ సుదీప్ సరసన ‘బిల్లా రంగా బాద్ షా’ అనే సినిమాలో నటించబోతోందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అనూప్ భండారి డైరెక్ట్ చేయబోతోన్న ఈ మూవీ హిస్టారికల్ ఫిక్షన్ గా రూపొందబోతోందంటున్నారు. మొత్తంగా అమ్మడు సౌత్ మొత్తాన్ని చుట్టే ప్లాన్ లో ఉందనే చెప్పాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com