Jana Gana Mana : జనగణమన.. విజయ్‌తో బుట్టబొమ్మ..!

Jana Gana Mana : లైగర్ మూవీ తర్వాత టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబోలో జనగణమన అనే మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి, చార్మీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ పూరి ఆమెను సంప్రదించినట్టుగా సమాచారం.
దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రానుంది. ప్రస్తుతం పూజా SSMB 28, కభీ ఈద్ కభీ దీపావళి, భవదీయుడు భగత్ సింగ్ మరియు సర్కస్ సినిమాలతో బిజీగా ఉంది. అటు విజయ్ జనగణమనతో పాటుగా శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ మూవీని చేస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com