Pooja Hegde : పవన్ సినిమాకి హ్యాండ్ ఇచ్చిన పూజా..!

Pooja Hegde : పవన్ సినిమాకి హ్యాండ్ ఇచ్చిన పూజా..!
Pooja Hegde : టాలీవుడ్ లో వన్ అఫ్ ది టాప్ హీరోయిన్ లలో పూజా హెగ్డే ఒకరు.. లక్కీ హీరోయిన్ గా ముద్ర పడిపోయిన ఈ అమ్ముడుకి ఇప్పుడు వరుస ఫ్లాప్స్ ఎదురవుతున్నాయి

Pooja Hegde : టాలీవుడ్ లో వన్ అఫ్ ది టాప్ హీరోయిన్ లలో పూజా హెగ్డే ఒకరు.. లక్కీ హీరోయిన్ గా ముద్ర పడిపోయిన ఈ అమ్ముడుకి ఇప్పుడు వరుస ఫ్లాప్స్ ఎదురవుతున్నాయి.. అయినప్పటికీ ఆమెకున్న క్రేజ్ కి చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. గబ్బర్ సింగ్ మూవీ తరవాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబోలో భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఎప్పుడు షూట్ కి వెళ్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు..ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఫైనల్ చేశారు.

అయితే ఇప్పుడామె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. దీనివెనుక కారణాలు ఇవే అని తెలుస్తున్నాయి... ప్రస్తుతం పవన్.. క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు అనే మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత వినోదయ సీతమ్ మూవీ లైన్ లో ఉంది.. భవదీయుడు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది.. అటు పూజా కూడా వరుసగా సినిమాలు లైన్ లో ఉన్నాయి. త్రివిక్రమ్ - మహేశ్ సినిమాతో పాటుగా, పూరి - విజయ్ సినిమాలకి కమిట్ అయింది. దీనితో పూజా.. హరీష్, పవన్ మూవీకి హ్యాండ్ ఇచ్చేసినట్టుగా టాక్ నడుస్తోంది. దీనిపైన క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇటీవల ఆచార్య, ఎఫ్ 3 మూవీస్ తో సందడి చేసింది పూజా.

Tags

Read MoreRead Less
Next Story