Pooja Hegde: అతడి వల్ల నా హార్ట్ బ్రేక్ అయ్యింది: పూజా హెగ్డే

Pooja Hegde: ప్రస్తుతం సినీ పరిశ్రమల్లో పూజా హెగ్డే పేరు సెన్సేషన్‌గా మారింది. కెరీర్ మొదట్లో గోల్డెన్ లెగ్ అనిపించుకొని బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకున్న ఈ భామ.. గత కొంతకాలంగా ఐరెన్ లెగ్ అనే పేరును మూటకట్టుకుంటోంది. కొన్నాళ్లుగా పూజా నటిస్తున్న సినిమాలేవీ ఆశించినంత విజయాన్ని అందుకోకపోవడమే దీనికి కారణం. తాజాగా తాను 12 ఏళ్ల వయసులోనే హార్ట్ బ్రేక్‌ను ఎదుర్కున్నానంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది పూజా.
ముందుగా ఓ తమిళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయిన పూజా.. తెలుగులో కొంతకాలంలోనే మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక తెలుగులో అప్పుడప్పుడే ఫేమ్ సంపాదించుకుంటున్న పూజాకు బాలీవుడ్ నుండి పిలుపు వచ్చింది. 'మొహంజోదారో' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అంతే కాకుండా మొదటి సినిమానే హృతిక్ రోషన్‌లాంటి స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే హృతిక్ వల్లే తన హార్ట్ బ్రేక్ అయ్యిందనే విషయాన్ని ఇటీవల బయటపెట్టింది పూజా.
పూజాకు చిన్నప్పటి నుండి హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టమట. అయితే తనకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కోయి మిల్ గయా సినిమా విడుదలయ్యిందట. ఎలాగైనా ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్ సంపాదించిన పూజా.. హృతిక్‌తో ఓ ఫోటో దిగాలనుకుందట. కానీ పూజా స్టేజ్‌పైకి వెళ్లే సమయానికి హృతిక్ స్టేజ్ దిగిపోయాడని తెలిపింది పూజా. అప్పుడే తన హార్ట్ బ్రేక్ అయినంత పనయ్యిందని చెప్పింది. ఇక చిన్నప్పుడు తాను ఎంతగానో ఇష్టపడిన హీరోతోనే కొన్నేళ్ల తర్వాత జోడీకట్టింది పూజా హెగ్డే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com