Pooja Hegde : లారెన్స్‌తో పూజా హెగ్డే రొమాన్స్

Pooja Hegde : లారెన్స్‌తో పూజా హెగ్డే రొమాన్స్
X

రాఘవా లారెన్స్‌ హీరోగా రమేశ్‌ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ అడ్వెంచరస్‌ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఎ స్టూడియోస్‌ ఎల్‌ఎల్‌పీ, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్‌ ప్రొడక్షన్స్‌పై కోనేరు సత్యానారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం ముందుగా కీర్తీ సురేష్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ను అనుకున్నారు. కానీ ఫైనల్ గా పూజా హెగ్డే కన్ఫార్మ్‌ చేసినట్టు కోలీవుడ్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటనరానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. నవంబరులో చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాని రిలీజ్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Tags

Next Story