Pooja Hegde: విజయ్ దేవరకొండతో పూజా.. సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా..?

Pooja Hegde: విజయ్ దేవరకొండతో పూజా.. సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా..?
Pooja Hegde: ఇక పూజాకు అవకాశాలు రావేమో అనుకుంటున్న సమయంలోనే విజయ్ దేవరకొండతో నటించే ఛాన్స్ కొట్టేసింది.

Pooja Hegde: తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగిపోయింది పూజా హెగ్డే. కెరీర్ ప్రారంభంలో పెద్దగా హిట్ సినిమాలు చేయకపోయినా.. తనకు స్టార్ల సరసన అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి. కానీ ఇటీవల టాలీవుడ్‌లోనే ఐరెన్ లెగ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది పూజా. దీంతో తనకు ఇక టాలీవుడ్‌లో అవకాశాలు రావు అనుకున్నారంతా. కానీ ఆశ్చర్యంగా మరో పాన్ ఇండియా సినిమాలో చోటు దక్కించుకుంది పూజా హెగ్డే.

'రాధే శ్యామ్', 'బీస్ట్'లాంటి పాన్ ఇండియా చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ టాక్ అందుకున్న తర్వాత పూజా చేతిలో ఇప్పుడు ఒకే తెలుగు సినిమా ఉంది. అది త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్న సినిమా. మిగిలినవి అన్నీ బాలీవుడ్ చిత్రాలే. అయితే ఐరెన్ లెగ్‌గా ముద్రపడిపోయింది కాబట్టి ఇక పూజాకు అవకాశాలు రావేమో అనుకుంటున్న సమయంలోనే ఓ పాన్ ఇండియా చిత్రంలో.. అది కూడా విజయ్ దేవరకొండతో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో 'లైగర్' చిత్రం తెరకెక్కుతుండగా.. ఈ సినిమా విడుదలవ్వకముందే 'జనగణమన' అనే మూవీ ప్రారంభమయ్యింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా పలువురు బాలీవుడ్ భామల పేర్లు వినిపించినా.. ప్రస్తుతం పూజా హెగ్డేకు పూరీ.. జనగణమన కథ వినిపించినట్టుగా టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే పూజా కూడా కథ నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story