Poonam Bajwa : పింక్ డ్రెస్ లో పూనమ్ బజ్వా.. ఫోటోలు వైరల్

సింధు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ అందగత్తె పూనమ్ బజ్వా. ఆ తర్వాత ప్రేమేంటే ఇంతే, బాస్ సినిమాల్లో నటించింది. తర్వాత కన్నడ, తమిళ, మళయాల సినిమాల్లో బిజీ అయ్యింది. 2005లో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామ ప్రస్తుతం ఎస్జీ 251 అనే మలయాళం సినిమాలో సురేశ్ గోపి సరసన నటించింది. తెలుగు, తమళ, కన్నడ ప్రేక్షకులను తన నటనా కౌశలంతో మెప్పించింది. “కుప్పతు రాజా,” “డాషింగ్ జిగర్వాలా 2,”“పాఠోన్పథం నూట్టండు” తదితర చిత్రాలు పూనమ్ బజ్వాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇటు సినిమాల్లో నటిస్తూ.. సోషల్ మీడియాలోనూ బిజీగా ఉంటోందీ బ్యూటీ. తాజాగా ఇన్స్టాగ్రాంలో ఆమె పోస్టు చేసిన ఫొటోలు వైరల్గా మారాయి. పింక్ చీరకు సొగసైన డిజైన్ కలిగిన చీరలో హొయలు పోతూ ఫొటోలకు పోజులిచ్చింది. సీతాకోకచిలుక ఎమోజీతో ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com