Poonam Bajwa: మీ సెక్సీ స్ట్రక్చర్ వెనుకున్న సీక్రెట్.. నెటిజన్ ప్రశ్నకు పూనమ్

Poonam Bajwa: కశ్మీర్ యాపిల్ లాంటి అంద చందాలతో కవ్వించే ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా. మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ... తర్వాత బాస్, పరుగు వంటి చిత్రాలతో నటించి మెప్పించింది. అలాగే తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ ఆకట్టుకుంది.
ఎంత అందముంటే ఏం లాభం అవగింజంత అదృష్టం కూడా ఉండాలి ఇండస్ట్రీలో పైకి రావాలంటే. ఆ లక్ లేకపోవడంతో ఈ అమ్మడు సినిమాల్లో పెద్దగా కనిపించడంలేదు. అడపా దడపా ఒకటి అరా సినిమాల్లో తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. ఇక సోషల్ మీడియాలో అయితే తన హాటు అందాల ఫొటోలతో కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తోంది.
కేవలం సోషల్ మీడియాలో ఫొటోలతోనే ఏం చేస్తాం.. అభిమానులతో కాసేపు ముచ్చటిస్తే సరిపోతుందిగా అని అనుకుందేమో ఈ అమ్మడు... తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. తన సోల్ మేట్ సునీల్ రెడ్డి వివరాలతో పాటు ఇతరత్రా వివరాలను తెలియజేస్తూనే వారి ఫొటోలను, తాను చీర కట్టులో ఉన్న ఫొటోలను కూడా పోస్ట్ చేసింది.
ఈ క్రమంలోనే ఆమెకు నెటిజన్ నుంచి ఓ చిలిపి ప్రశ్న ఎదురైంది. "మీ సెక్సీ స్ట్రక్చర్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? అని ప్రశ్నించాడు. దానికి "పూనమ్" ఏమాత్రం తడబడకుండా, చాలా తెలివిగా, కూల్‌గా... నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగ చేస్తాను అని సమాధానం చెబుతూ తాను యోగ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. పూనమ్ సమాధానంతో సదరు నెటిజన్‌కు నోట మాట రాలేదు పాపం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com