సినిమా

Poonam Kaur : శ్యామ్‌‌‌సింగరాయ్ సినిమా పై పూనమ్ కౌర్ కామెంట్స్..!

Poonam Kaur :నాని, సాయి పల్లవి, కృతిశెట్టి మెయిన్ లీడ్‌‌‌లో తెరకెక్కిన తాజా చిత్రం శ్యామ్‌‌‌సింగరాయ్..

Poonam Kaur  : శ్యామ్‌‌‌సింగరాయ్ సినిమా పై పూనమ్ కౌర్ కామెంట్స్..!
X

Poonam Kaur :నాని, సాయి పల్లవి, కృతిశెట్టి మెయిన్ లీడ్‌‌‌లో తెరకెక్కిన తాజా చిత్రం శ్యామ్‌‌‌సింగరాయ్.. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల రిలీజై మంచి టాక్‌‌ని సంపాదించుకొని వసూళ్ళ పరంగా దూసుకుపోతోంది. రెండు పాత్రల్లో నాని అభినయం ప్రేక్షకులను కట్టిపడేసింది. అభిమానుల నుంచి మాత్రమే కాదు సెలబ్రిటీల నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమాని తన కుటుంబ సభ్యులతో కలిసి చూసింది నటి పూనమ్ కౌర్.. అనంతరం సినిమా పైన తన ఇన్‌‌స్టా‌‌గ్రామ్ వేదికగా స్పందించింది.

ఇటీవలి కాలంలో చాలా నచ్చిన సినిమా ఇదని తెలిపింది. ఈ సినిమా తనని చాలా తేలికగా వేరే టైమ్ జోన్‌కి తీసుకెళ్లిందని పేర్కొంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మకు ఈ సినిమా చూపించినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది. సాయిపల్లవి చాలా సహజంగా నటించిందని, రోజీ అనే పాత్రకి సొగసైన అందాన్ని తీసుకొచ్చిందని పేర్కొంది. ఇక నాని అద్భుతమైన స్క్రిప్ట్స్‌‌‌తో ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాని దిల్జిత్ దోసంజ్ వంటి నటులతో హిందీలో రీమేక్ చేయబడుతుందని ఆశిస్తున్నానని పేర్కొంది.

ఇక అటు వసూళ్ళ పరంగా చూస్తే.. . మొదటి నాలుగు రోజుల్లో మంచి వసూళ్లు వచ్చాయి. ఏరియాల వారీగా నాలుగు రోజుల 'శ్యామ్‌ సింగ రాయ్‌' కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజాం : రూ. 6.90 కోట్లు

సీడెడ్ : రూ. 1.82 కోట్లు

ఉత్తరాంధ్ర : రూ. 1.55 కోట్లు

ఈస్ట్ : రూ. 0.68 కోట్లు

వెస్ట్ : రూ. 0.57 కోట్లు

గుంటూరు : రూ. 0.86 కోట్లు

కృష్ణా : రూ. 0.64 కోట్లు

నెల్లూరు : రూ. 0.43 కోట్లు

ఏపీ, తెలంగాణ : 13.45 కోట్లు (22.90 కోట్లు గ్రాస్)

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా : రూ. 2.40 కోట్లుఓవర్సీస్ : రూ. 3.20 కోట్లు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : రూ. 19.04 కోట్లు (రూ.34 కోట్లు గ్రాస్)..

ఏపీ, తెలంగాణ కలెక్షన్స్..

ఫస్ట్ డే : రూ. 4.17 కోట్లు

సెకండ్ డే : రూ.4.38 కోట్లు

థర్డ్ డే : రూ.3.52 కోట్లు

ఫోర్త్ డే : రూ.1.38 కోట్లు

Next Story

RELATED STORIES