Poonam Kaur : త్రివిక్రమ్ నూ ప్రశ్నించాలి.. పూనమ్ కౌర్ సంచలన ట్వీట్

Poonam Kaur :  త్రివిక్రమ్ నూ ప్రశ్నించాలి.. పూనమ్ కౌర్ సంచలన ట్వీట్
X

ప్రస్తుతం జానీ మాస్టర్ ఇష్యూతో మీ టూ ఉద్యమం మరోసారి లైమ్ లైట్ లోకి వస్తోంది. గతంలో మీ టూ ఉద్యమం ఉదృతంగా ఉన్నప్పుడు అనేక మందిపై అనేక కంప్లైంట్స్ వచ్చాయి. వీటి కోసం టాలీవుడ్ నుంచి కమిటీలు వేశారు. బట్ ఏ అంశంలోనూ ప్రాపర్ గా చర్యలు తీసుకున్నట్టు కనిపించలేదు. ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ సైతం రెండు వారాలుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉంది. అక్కడ న్యాయం జరిగేలా లేదు అనే సదరు లేడీ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. దీంతో పాత కమిటీల మరోసారి మేటర్ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ వ్యవహారం సాగుతున్న తరుణంలో నటి పూనమ్ కౌర్ ఓ సంచలన విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

‘‘ ఒకవేళ మూవీ ఆర్టిస్ట్స అసోసియేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నేను చేసిన కంప్లైంట్ ను అప్పుడే సీరియస్ గా తీసుకుని ఉంటే నాతో సహా చాలా మందికి రాజకీయంగా ఇబ్బందులు వచ్చేవి కావు, అసోసియేషన్ పెద్దల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినా మౌనంగా ఉండి, పట్టించుకోలేదు. ఇండస్ట్రీ పెద్దలు దర్శకుడు త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి’’ అని కోరుతున్నా.. అంటూ ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోందిప్పుడు.

కొన్నాళ్లుగా త్రివిక్రమ్ తో పాటు పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఏ విషయం వచ్చినా వారికి వ్యతిరేకంగా పూనమ్ కౌర్ రియాక్ట్ అవుతూనే ఉంది. రీసెంట్ గా కూడా అల్లు అర్జున్ కే తన సపోర్ట్ అంటూ ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ పై వ్యతిరేకతను చూపించింది. ఇప్పుడున్న విషయం హాట్ గా ఉంది. ఈ టైమ్ లో తను చేసిన పోస్ట్ పై ఇండస్ట్రీ పెద్దలు రియాక్ట్ అవుతారా..? అనేది వేచి చూడాలి.

Tags

Next Story