Poonam Kaur: థాంక్యూ పూనమ్ ఆంటీ.. ఇన్‌స్టాలో పూనమ్ పోస్ట్ వైరల్

Poonam Kaur (tv5news.in)
Poonam Kaur: పూనమ్ కౌర్.. గత కొంతకాలంగా ఈ పేరుకు ఉన్న ఫాలోయింగ్ మరింత పెరిగింది. మా ఎన్నికలతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఆ ఎన్నికల సమయంలో పూనమ్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అయ్యాయి. తన సోషల్ మీడియా పోస్టులు కూడా సంచలనం సృష్టించాయి. మునుపటి కంటే పూనమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ చాలా క్యూట్‌గా అనిపిస్తోంది.
థాంక్యూ పూనమ్ ఆంటీ అంటూ అనీష్ అనే ఒక కుర్రాడు తనకు గ్రీటింగ్ కార్డ్‌తో పాటు పూల మొక్కను పంపించాడు. గ్రీటింగ్ కార్డ్‌తో ఉన్న ఈ మొక్కను ఫోటో తీసి పూనమ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అనీష్‌కు ధన్యవాదాలు చెప్పింది.
'నీ ప్రయాణాన్ని దగ్గర నుండి చూడాలని ఆశపడుతున్నాను. నువ్వు అందరిలాగా కాదు. ప్రకృతికి కనెక్ట్ అయిపోతావు. వాతావరణ మార్పులను అర్థం చేసుకుంటావు. పక్షులను ఇష్టపడతావు. ఇంత చిన్న వయసులో నువ్వు సాధించిన ఘనతను చూసి చాలా గర్వపడుతున్నాను' అంటూ క్యాప్షన్ పెట్టి ఆ ఫోటోను పోస్ట్ చేసింది పూనమ్.
పూనమ్ కౌర్ పేరుకు సినిమా యాక్టరే అయినా ప్రకృతిని చాలా ఇష్టపడుతుంది. అంతే కాకుండా తన చుట్టూ ఉండేవారికి కూడా ప్రకృతిని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో చెప్తుంది. అందుకే అనీష్ అనే కుర్రాడు పెట్టిన పోస్ట్‌కు అంత ప్రేమతో స్పందించింది. అందుకే నెటిజన్లు కూడా ఈ విషయంలో పూనమ్‌ను అభినందిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com