Maa Elections 2021: పోలింగ్ బూత్ దగ్గరే మనసులో మాట బయటపెట్టిన పూనమ్..
Maa Elections 2021 : #pklove ఈ హ్యాష్ ట్యాగ్ తో ఈమధ్య కేక పుట్టించిన టాలీవుడ్ భామ పూనమ్ కౌర్.. మా ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకు తాను ఏ ప్యానల్ కు సపోర్ట్ అన్నదానిని బయటపెట్టకపోయినా.. ఇప్పుడు మాత్రం తన మనసులో ఏముందో చెప్పేశారు. దీంతో ఇప్పటివరకు సైలెంట్ గానే ఉన్నా.. స్వీట్ గానే చెప్పినా.. పూనమ్ బాగానే మ్యానేజ్ చేస్తోంది అనుకుంటున్నారు.
మా ఎన్నికల్లో ఓటేయడానికి వచ్చిన పూనమ్.. తాను ప్రకాశ్ రాజ్ ప్యానల్ కే ఓటేశానని డైరెక్ట్ గానే చెప్పేసింది. దీంతో ఆమె చాలా చాకచక్యంగా వ్యవహరించినట్లు అర్థమవుతోంది. కాకపోతే మా ఎన్నికల్లో రాజకీయాలు వద్దని.. ఓ మంచి మాట మాత్రం చెప్పింది. దీంతో పూనమ్ కు అందంతో పాటు తెలివితేటలు కూడా ఎక్కువే అనుకుంటున్నారు.
పూనమ్ ఈమధ్యకాలంలో సరిగా సినిమాలు చేయకపోయినా.. #pklove హ్యాష్ ట్యాగ్ తో టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. pk అంటే ఎవరు అన్న చర్చ జోరుగా సాగింది. ఆమె గతంలోనూ ఇలాంటి హ్యాష్ ట్యాగ్ ను వాడింది. పైగా మెగా ఫ్యామిలీ మద్దతు ఇచ్చిన ప్రకాశ్ రాజ్ ప్యానల్ కే తన ఓటు అని చెప్పింది. చెప్పినట్టుగానే ఆ ప్యానల్ కే ఓటు వేశానంది. పైగా రాజకీయ లబ్ది కోసం ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టొద్దని పూనమ్ అన్నారు. మాను రాజీకీయాలతో ముడిపెట్టొద్దని వ్యక్తం చేసారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com