Poonam Kaur: 'బావ సినిమా సూపర్ హిట్'.. 'భీమ్లా నాయక్' సినిమాపై పూనమ్ ట్వీట్..

Poonam Kaur: సినిమాలకు దూరంగా ఉంటున్నా కూడా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న నటీనటులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు నటి పూనమ్ కౌర్. కొన్నాళ్ల సినిమాలకు, ప్రేక్షకులకు దూరంగా ఉన్న పూనమ్.. ఇప్పుడిప్పుడే తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది. పైగా తాను సోషల్ మీడియాలో చేసే పోస్టులు కూడా కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తున్నాయి. 'భీమ్లా నాయక్' రిలీజ్ సందర్భంగా పూనమ్ చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
పూనమ్ కౌర్ ముందుగా వేరొకరితో చాట్ చేసిన వాట్సాప్ మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ తీసి పోస్ట్ చేసింది. అందులో ఆయన.. బావ సినిమాకు వచ్చాను అక్క అని చెప్పగా పూనమ్ నిజాయితీగా రివ్యూ చెప్పమని ఆయనను అడిగింది. దానికి జవాబుగా సినిమా సూపర్ హిట్ అన్నాడు. ఈ చాట్‌ను అంతా ఓ లవ్ ఎమోజీ పెట్టి షేర్ చేసింది పూనమ్.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) February 25, 2022
అయితే ఈ ట్వీట్ చేసిన కాసేపటికి పూనమ్ మరో ట్వీట్ చేసింది. 'ఏం జరిగినా కూడా నేను బలవంతంగా కొన్ని ఎమోషన్స్‌ను భరించాల్సి వస్తుంది. అదంత సులభం కాదు. ఇది నాలుగేళ్ల కథ. కానీ మొదటిసారి ఇదంతా పాజిటివ్‌గా ఉంది. అందుకే పోస్ట్ చేస్తున్నా.' అని ట్వీట్ చేసింది పూనమ్. మరి ఈ ట్వీట్ ఎవరికోసం చేసింది, దేనిని ఉద్దేశించి చేసింది అని మాత్రం ఎవరికీ తెలియదు.
No matter what happen I am forced to go thru the same emotions ,
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) February 25, 2022
It's not easy : story for four years ,
But for the first time it was positive . So posted .
'God bless people with some gratitude and responsibility for the unconditional love'#peace #omshanti
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com