Poonam Kour: పూనమ్ కౌర్ అసలు బ్యాక్‌ గ్రౌండ్ ఇదే.. అందుకే వాళ్లంతా..

Poonam Kour: పూనమ్ కౌర్ అసలు బ్యాక్‌ గ్రౌండ్ ఇదే.. అందుకే వాళ్లంతా..
Poonam Kour: ముగ్ధమనోహర రూపంతో ముద్దుగా ఉంటుంది పూనమ్ కౌర్.

Poonam Kour: ముగ్ధమనోహర రూపంతో ముద్దుగా ఉంటుంది పూనమ్ కౌర్. అడపా దడపా సినిమాల్లో ఆఫర్లు వచ్చినా అంతకంటే ఎక్కువ పబ్లిసిటీని సంపాదిస్తుంది. తనకు సంబంధం లేని ఇష్యూలో కూడా తన పేరు వినిపిస్తూ ఉంటుంది. పూనమ్ కౌర్.. అవడానికి పంజాబీ అమ్మాయే అయినా హైదరాబాదులో పుట్టి పెరిగింది.

పూనమ్ ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసిందని చాలా మందికి తెలియదు. 2006 మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకోవడంతో అందరి దృష్టి ఆమె పై పడింది. ఆ తరువాతే సినిమా రంగం వైపు అడుగులు వేసింది. తేజ డైరెక్షన్‌లో ఓ చిత్రాన్ని చేసేందుకు అవకాశం కూడా వచ్చింది అదే ఏడాదిలో. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. అతడి డైరెక్షన్లలోనే మరో చిత్రం "ఒక వి చిత్రం" చేసింది పూనమ్.

అదే సంవత్సరంలో అంటే 2006 లోనే తన కెరీర్‌లో రెండో చిత్రం "మాయాజలం" కు సంతకం చేసింది. ఈ సినిమా "ఒక వి చిత్రం" విడుదలకు ముందే రిలీజైంది. దాంతో పూనమ్ కౌర్ తొలి చిత్రం 'మాయాజలం' అయింది.

2007 లో పూనమ్ "నెంజిరుక్కుం వారై" చిత్రంతో తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది. 2008 లో, ఆమె "బంధు బలగా" చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగు పెట్టింది. అదే సంవత్సరం, టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్, అనుష్క శెట్టితో కలిసి 'శౌర్యం' సినిమా చేసింది. ఈ చిత్రంలో నటనకు ఉత్తమ సహాయ నటిగా పూనమ్.. ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది.

'శౌర్యం' సక్సెస్‌తో పూనమ్ చాలా మంది నిర్మాతల దృష్టిలో పడింది. కానీ అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత "ఉన్నైపోల్ ఒరువన్" అనే తమిళ చిత్రంలో నటించింది. ఈ చిత్రం "A బుధవారం" బాలీవుడ్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో, ఆమె కమల్ హసన్, మోహన్ లాల్‌ వంటి మహామహులతో కలిసి నటించింది.

బాలీవుడ్ చిత్రం "జునూనియట్" లో పూనమ్ కనిపించింది. ఈ చిత్రంలో యామీ గౌతమ్, పుల్కిత్ సామ్రాట్ ప్రధాన పాత్రలు కాగా మరో ప్రముఖ పాత్రకు పూనమ్‌కి అవకాశం లభించింది. అందంతో పాటు అయిదు భాషలు అనర్గళంగా మాట్లాడగలగడం ఆమెకు పెద్ద ప్లస్ పాయింట్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, మలయాళం భాషల్లో ఒక్కసారి కదిలిస్తే నాన్‌స్టాప్‌గా మాట్లాడేస్తుంది.

ఇంత టాలెంట్ ఉన్నా పూనమ్ పేరు తెలుగు రాష్ట్రాల్లోనూ బాగా వినిపిస్తోంది. ప్రముఖ రాజకీయ పార్టీల నాయకుల విభేదాల మధ్య పూనమ్ కౌర పేరు ఎక్కువగా ప్రస్తావనకు వస్తోంది. దీంతో నెటిజన్లంతా అసలీ పూనమ్ కౌర్ ఎవరు? ఏమిటి అని ఆమె బ్యాక్ గ్రౌండ్‌ని తెగ సెర్చ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story