Poonam Pandey: నటి పూనమ్ పాండేపై భర్త సామ్ దాడి..

Poonam Pandey: బాలీవుడ్ నటి పూనమ్ పాండేపై భర్త సామ్ అహ్మద్ దాడి చేశాడు. మొదటి భార్యతో భర్త మాట్లాడుతుండగా.. ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అతను పూనమ్ పై దాడి చేశాడు. స్వల్పగాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సామ్‌పై గృహహింస కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పూనమ్ పాండే తనపై దాడి చేశాడని నటి ఫిర్యాదు చేయడంతో ఆమె భర్త సామ్ బాంబేను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె తల, కళ్లు, ముఖంపై గాయాలయ్యాయి.
"భారత శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ల కింద సామ్ బాంబేపై కేసు నమోదు చేయబడింది అని ముంబై పోలీసులు తెలిపారు. సామ్.. పూనమ్‌పై దాడి చేయడం ఇది మొదటిసారి కాదు. గత సంవత్సరం వారి వివాహమైన కొద్ది రోజులకే దాడికి పాల్పడ్డాడు. తన భర్త తనను వేధించాడని, నోరెత్తితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడని పాండే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అప్పుడు కూడా గృహ హింస కేసు నమోదు చేసి వెంటనే భర్తతో రాజీపడి, "ఏ వివాహా బంధంలో అయినా గొడవలు సహజం.. వాటిని తెగేదాకా లాక్కూడదు" అని చెప్పింది. పెళ్లి చేసుకోవడానికి ముందు పూనమ్ మరియు సామ్ దాదాపు రెండు సంవత్సరాలు కలిసి జీవించారు. వారి వివాహానికి సంబంధించిన ఫోటోను పంచుకుంటూ, ఆమె Instagram లో ఇలా రాసింది, "ఇదిగో మీతో ఏడు జీవితాల కోసం ఎదురు చూస్తున్నాను. "
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com