Ajith Kumar : స్టార్ హీరో సినిమాను ఎవరూ పట్టించుకోవడం లేదే

అజిత్ కుమార్.. ఒకప్పుడు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్. తమిళ్ లో టాప్ స్టార్స్ లో ఒకడుగా ఉన్నాడిప్పుడు. రజినీకాంత్, విజయ్ తర్వాత అంత పెద్ద స్టార్డమ్, ఫ్యాన్ బేస్ ఉన్న హీరో అతను. ఈ గురువారం అతను నటించిన గుడ్ బ్యాగ్ అగ్లీ మూవీ విడుదలవుతోంది. ఆధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో త్రిష మెయిన్ హీరోయిన్. చాలా స్టార్డమ్ ఉన్న హీరో అంటే ఇతర భాషల్లో కూడా అంతో ఇంతో క్రేజ్ ఉంటుంది కదా.. బట్ అజిత్ కు తెలుగులో ఇప్పుడు ఎలాంటి క్రేజ్ లేదు. మినిమం ఓపెనింగ్స్ కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పైగా అతని చిత్రాలకు ప్రమోషన్స్ ఏం ఉండవు. అతను తమిళ్ లోనే రాడు. ఇక తెలుగులో అంటే ఇతర ఆర్టిస్టులతో కలిపి ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిదైనా నిర్వహించాలి. అదీ లేదు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ బ్యానర్ ఇక్కడ రిలీజ్ చేస్తోంది. అయినా వాళ్లు కూడా మినిమం ప్రమోషన్స్ ఏం చేయలేదు.
ఇక ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి సంబంధించి తెలుగులో ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అసలు ఈ మూవీ విడుదలవుతున్న విషయం కూడా చాలామందికి తెలియదు. అంత పూర్ గా ఉంది మూవీ పరిస్థితి. దీనికి తోడు రెండు నెలల క్రితం ఇదే కాంబోలో(అజిత్, త్రిష) వచ్చిన పట్టుదల మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిపించుకుంది. ఆ ప్రభావం ఈ చిత్రంపై చాలా ఎక్కువగా కనిపిస్తోంది. బుకింగ్స్ అసలే లేవు. మొత్తంగా అజిత్ రేంజ్ ఉన్నవారే కాదు.. తక్కువ రేంజ్ ఉన్న తమిళ్ హీరోస్ మూవీస్ కూ ఇక్కడ క్రేజ్ ఉంది. బట్ అతని సినిమాను ఎవరూ పట్టించుకోవడం లేదంటే ఆశ్చర్యమేం లేదు. అదంతా ఆయన స్వయంకృతాపరాధమే కదా..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com