Kamal Haasan : థగ్ లైఫ్.. అనుకున్నదే జరిగింది

కమల్ హాసన్, మణిరత్నంల సినిమా. క్రేజీ కాంబినేషన్, లెజెండ్స్ మూవీ.. 35 ఇయర్స్ తర్వాత చేస్తోన్న సినిమా.. స్టార్ కాస్టింగ్, రహమాన్ మ్యూజిక్.. అబ్బో.. ఇలా శానా చెప్పుకుంటూ మొదలైన సినిమా థగ్ లైఫ్. పైగా చాలాయేళ్ల తర్వాత కమల్ హాసన్ విక్రమ్ తో విజయం అందుకున్నాడు. ఆ ఊపులో వస్తోంది కాబట్టి థగ్ లైఫ్ కూడా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందీ అనుకున్నారు. కానీ ఆ క్రేజ్ మొత్తం తుస్సుమంది. థగ్ లైఫ్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టడం కాదు కదా.. కనీసం కూడా సాధించే పరిస్థితి లేదు అని ఫస్ట్ డే ఫస్ట్ షోకే తేల్చారు ఆడియన్స్. నిజానికి ఆ టైమ్ లో ఎక్కువగా చూసేది అభిమానులే. వాళ్లే బాలేదు అన్నారు అంటే ఈ మూవీ ఎంత డిజాస్టరో వేరే చెప్పక్కర్లేదు. మొదటి రోజే డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాకు ఈవెనింగ్ కే కలెక్షన్స్ డ్రాప్ అయిపోతాయి అని ఈ మధ్య ప్రతి సినిమా నిరూపిస్తూనే ఉంది. ఆ కోవలకే కమల్ హాసన్, మణిరత్నంల థగ్ లైఫ్ కూడా చేరింది.
ప్రస్తుతం వెటరన్స్ కూడా ఫస్ట్ డే రికార్డ్ ఓపెనింగ్స్ సాధిస్తోన్న పరిస్థితి చూస్తున్నాం. బట్ థగ్ లైఫ్ లో అంత స్టార్ కాస్ట్ ఉన్నా.. కేవలం 36 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా థగ్ లైఫ్ కు వచ్చిన ఓపెనింగ్స్ కేవలం 36 కోట్లు. అంటే మౌత్ టాక్, రివ్యూస్ ఇంపాక్ట్ సినిమాలపై ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. విశేషం ఏంటంటే... ఇప్పుడు ప్రేక్షకులు పెయిడ్ రివ్యూస్, పెయిడ్ మౌత్ టాక్స్ ను ఈజీగా పసిగట్టేస్తున్నారు. దీంతో సినిమాలో నిజంగా మేటర్ ఉందా లేదా అనేది ఇట్టే తెలుసుకుంటున్నారు. అందుకే థగ్ లైఫ్ ఇంత పూర్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోవడం కష్టమే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com