Ram Charan : మళ్లీ ఫెయిల్ అయిన గేమ్ ఛేంజర్

Ram Charan :  మళ్లీ ఫెయిల్ అయిన గేమ్ ఛేంజర్
X

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ డైరెక్ట్ చేసిన మూవీ గేమ్ ఛేంజర్. గత సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రానికి థియేటర్స్ నుంచి ఫ్లాప్ టాక్ వచ్చింది.దీనికి తోడు రిలీజ్ రోజునే ఆన్ లైన్ లో హెచ్.డి ప్రింట్ లీక్ అయింది. అసలే వీక్ కంటెంట్ అంటే శంకర్ దర్శకత్వం కూడా అంతకంటే వీక్ గా కనిపించింది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ అందులో పావు వంతు కూడా వెనక్కి తేలేకపోయింది.

ఇక తర్వాత ఓటిటిలో విడుదలైనప్పుడు కొందరు బానే ఉందన్నారు తప్ప.. సూపర్ హిట్ మూవీ కదా ఎందుకు ఫ్లాప్ అయింది అని ఎవరూ అనలేదు. అంటే థియేటర్స్ లో ఫ్లాప్ అయిన ఈ చిత్రం ఓటిటిల్లో యావరేజ్ మూవీ అనిపించుకుందన్నమాట. బట్ లేటెస్ట్ గా మరోసారి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది గేమ్ ఛేంజర్. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు దక్కించుకుంది. తాజాగా టివిలో ప్రసారమైన గేమ్ ఛేంజర్ కు కేవలం 5.02 పాయింట్స్ మాత్రమే రేటింగ్ వచ్చింది. ఓ స్టార్ హీరో సినిమాకు ఈ రేటింగ్ అంటే టివిల్లో బొమ్మ ఫెయిల్ అయినట్టుగానే భావించాలి. నిజానికి ఈ మధ్య పెద్ద సినిమాలకు టివిల్లో పెద్దగా రేటింగ్స్ రావడం లేదు. ఆ కోవలోనే ఇదీ చేరింది అనుకోవాలి.

Tags

Next Story