సినీ పరిశ్రమలో మరో విషాదం.. టీవీ నటుడు ఆత్మహత్య..

సినీ పరిశ్రమలో మరో విషాదం.. టీవీ నటుడు ఆత్మహత్య..
ప్రముఖ మలయాళ సినీ, టీవీ నటుడు రమేశ్ వలీయశాల (54) ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రముఖ మలయాళ సినీ, టీవీ నటుడు రమేశ్ వలీయశాల (54) ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల ప్రముఖ హిందీ బుల్లితెర నటుడు సిద్ధార్ధ్ శుక్లా మరణం మరవక ముందే మరో నటుడి మృతి సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. 22 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈ సీనియర్ నటుడు శనివారం (సెప్టెంబర్ 11) ఉదయం తిరువనంతపురంలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆయన మరణ వార్తతో మాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.

దీంతో సోషల్ మీడియా వేదికగా నటీనటులు, దర్శక నిర్మాతలు, రమేష్ మృతికి నివాళులర్పిస్తున్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కేరళ పరిశ్రమలో వరుసగా సీరియల్స్, సినిమాలు చేస్తూ నటుడిగా బిజీగా ఉన్న తరుణంలో ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం, అదీ బలవంతంగా ఆత్మహత్యకు పాల్పడడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు మిస్టీరియస్ డెత్‌గా నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రెండు రోజుల క్రితమే రమేశ్ వలియశాల షూటింగ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చారని ఈ రోజు ఇలా జీవచ్చవంలా కనిపించడంతో తోటి నటీనటులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాత మరియు ప్రొడక్షన్ కంట్రోలర్ NM బాదుషా సోషల్ మీడియాలో నటుడి మరణం గురించి మొదట ప్రకటించారు. "చాలా సమస్యలు ఉంటాయి. కానీ జీవితం నుండి పారిపోవడం ఏమిటి .. నా ప్రియమైన స్నేహితుడు రమేష్‌కు నివాళి "అని బాదుషా ఫేస్‌బుక్‌లో రాశారు.

రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ సీరియల్ నటులలో ఒకడు, సినిమాలలో కూడా నటించాడు. రమేష్ తన కాలేజీ రోజుల తర్వాత స్నేహితులతో కలిసి స్టేజ్‌ మాద నాటకాలు ప్రదర్శించేవాడు. అక్కడి నుంచి టీవీ సీరియల్స్, సినిమాల్లోకి వచ్చి 22 సంవత్సరాలుగా చాలా బిజీ నటుడిగా మారిపోయాడు.

తమిళ పరిశ్రమ ఆత్మహత్య కారణంగా చాలా మరణాలను చూస్తోంది. కొంతకాలం క్రితం, నటుడు చిత్ర తన జీవితాన్ని తానే తీసుకుంది. ఆమె సోప్ ఒపెరా పాండియన్ స్టోర్స్ ద్వారా కీర్తికి ఎదిగింది. ఆమె తన వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొని ఆత్మహత్యకు పాల్పడింది. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసిన తమిళ టెలివిజన్ నటుడు ఇంద్ర కుమార్ నటుడు ఫిబ్రవరి 19, 2021 లో పెరంబలూర్‌లోని స్నేహితుడి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయాడు.

Tags

Read MoreRead Less
Next Story