వెబ్ సిరీస్ యాక్టర్ అప్పూగారు.. అంత పాపులర్ ఎలా అయ్యారు..

వెబ్ సిరీస్ యాక్టర్ అప్పూగారు.. అంత పాపులర్ ఎలా అయ్యారు..
ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా 17 ఎపిసోడ్స్‌లో నటించింది.

షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సూర్య వెబ్ సిరీస్‌లో అతడికి జోడీగా నటిస్తూ వ్యూయర్స్ అభిమానాన్ని చూరగొంటోంది అంజలి వర్సెస్ మౌనిక రెడ్డి. అమ్మాయి క్యూట్, అబ్బాయి నాటు అనే వెబ్ సిరీస్‌తో అప్పూగారిగా అలరించిన మౌనికకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి దగ్గర కొలిపరలో 1994 ఏప్రిల్ 10న మౌనిక జన్మించింది. తండ్రి సుబ్బారెడ్డి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. అమ్మ రాణి గృహిణి. తన స్కూలింగ్ అంతా తెనాలి కృష్ణవేణి టాలెంట్‌లో పూర్తి చేసింది. తరువాత వైజాగ్ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్, తిరుపతి విద్యానికేతన్‌ కాలేజీ నుంచి బీటెక్, వైజాగ్ విజ్ఞాన్ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసింది.

హైదరాబాద్ హెచ్‌జి‌ఎస్ కంపెనీలో హెచ్ ఆర్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మౌనిక ఫోటో షూట్స్, వీడియోలు ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేస్తుండేది. అలా ఆమెని చూసి అమ్మాయి క్యూటు అబ్బాయి నాటు అనే వెబ్ సిరీస్ ఆడిషన్స్‌కి పిలిచారు. అందులో సెలెక్ట్ అయింది. ఈటీవీ ప్లస్‌లో ప్రసారమైన ఈ వెబ్ సిరీస్ ఆమెకు యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.

అయితే ఉద్యోగం చేస్తున్నప్పుడే వెబ్ సిరీస్‌లో అవకాశాలు రావడంతో ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా 17 ఎపిసోడ్స్‌లో నటించింది. 18వ ఎపిసోడ్ నాటికి రూ. 5వేలు రెమ్యునరేషన్ తీసుకుంది. ఆపై రెండేళ్లకు జాబ్‌కు రిజైన్ చేసింది. ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ భరత్ మౌనికను హీరోయిన్‌గా పెట్టి ఓ సినిమా తీయాలనుకున్నారట. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

అయితే ఆ వెంటనే వచ్చిన మరో వెబ్ సిరీస్ సూర్య.. షణ్ముఖ్ జస్వంత్‌తో కలిసి నటిస్తోంది. ఇందులో తన నటనకు గాను మంచి మార్కులే పడుతున్నాయి. వెబ్ సిరీస్ ద్వారా నెలకు రూ.50 వేలు సంపాదిస్తోంది మౌనిక.

Tags

Read MoreRead Less
Next Story