Robinhood : వాయిదా పడే అవకాశాలున్నాయా?

Robinhood : వాయిదా పడే అవకాశాలున్నాయా?
X

ప్రస్తుతం వరుస పరాజయాల్లో ఉన్న యువ హీరో నితిన్( Nithin ) తిరిగి ఫామ్ లోకి రావాలంటే సాలిడ్ హిట్ కొట్టాల్సి ఉంది. ‘తమ్ముడు, రాబిన్‌హుడ్’ అనే రెండు సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ పట్టాలెక్కించాడు. అవి త్వరలోనే పూర్తవుతాయి. వాటిలో వెంకీ కుడుముల ( Venky Kudumula ) దర్శకత్వంలోని రాబిన్‌హుడ్ ను ఈ ఏడాది డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇంతకు ముందు అఫీషియల్ గా ప్రకటించారు.

అయితే రామ్ చరణ్‌ ( Ram Charan ) తో దిల్ రాజు ( Dil Raju ) నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ ను కూడా 2024 క్రిస్మస్ సీజన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటి నుంచి.. రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోయాయి. ఆ సీజన్ లో ముందుగా విడుదల తేదీలు ప్రకటించిన కొన్ని సినిమాలు .. రిలీజ్ డేట్స్ రీషెడ్యూలింగ్ అయ్యాయి.

దాంతో ఇప్పుడు రాబిన్‌హుడ్ నిర్మాతలు ఈ చిత్రాన్ని వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 2025 న రాబిన్ హుడ్ ను విడుదల చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. జనవరి 2025 సంక్రాంతి విడుదలలతో నిండినందున, మేకర్స్ ఫిబ్రవరి కోసం చూస్తున్నారు. ఇంకా నిర్ధారణ కానప్పటికీ, ఈ వార్త నెమ్మదిగా చర్చనీ యాంశంగా మారింది.

Tags

Next Story