Pawan Kalyan : పవర్ స్టార్ పవర్ ఫుల్ స్పీచ్

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై భారీ అంచనాలైతే ఉన్నాయి. పవన్ ఈ మధ్యే ఓజితో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చూశాడు. ఆ తర్వాత చేసిన మూవీ ఇదే. ఈ మూవీ కోసం కూడా చాలా టైమ్ తీసుకున్నాడు. బట్ ఎంత టైమ్ పట్టినా అవుట్ పుట్ మాత్రం అదిరిపోయింది అనిపించేలా ఉంది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో ఓ రేంజ్ లో చూపించాడు పవన్ ను హరీష్ శంకర్ అనిపించారు. నిజంగా ఇలాంటి ట్రైలర్స్ ఈ మధ్య పవన్ మూవీస్ లో రాలేదు. అంత పవర్ ఫుల్ గా ఉంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం కూడా చాలా మెచ్యూర్డ్ గా ఉంది. అలాగే అంతే పవర్ ఫుల్ గా కూడా ఉంది. దాదాపు 35 నిమిషాల పాటు సాగిన స్పీచ్ లో మెయిన్ గా సినిమాల గురించి మాత్రమే మాట్లాడాడు. ప్రధానంగా ఇండస్ట్రీలో జరుగుతున్న పాజిటివ్ థింగ్స్ మాట్లాడాడు. మెగాస్టార్ ను తన గెస్ట్ గా పిలిస్తే ఆయన్ని కేవలం అన్నయ్యగా మాత్రమే చూస్తాను. నేను హీరోని మర్చిపోతాను అన్నాడు. అలాగే ఇతర హీరోల గురించి మాట్లాడాడు. టికెట్ రేట్స్ గురించి ప్రస్తావించాడు.
ఇక హరీష్ శంకర్ తన నోటి దూల తగ్గించుకోవాలని హితవు పలికాడు. అతనితో పనిచేయడం ఉత్సాహాన్ని ఇస్తుందన్నాడు. తన నెక్ట్స్ మూవీ అంటే మైత్రీ వాళ్లు, హరీష్ వస్తే అంతా సెట్ అవుతుందన్నాడు. తన ట్రైలర్ కు ట్వీట్ చేసిన మెగాస్టార్, రామ్ చరణ్ కు థ్యాంక్స్ చెప్పాడు. పిఠాపురం వాసి అయిన బుచ్చిబాబుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. మొత్తంగా పవన్ పొలిటికల్ డైలాగ్స్ కు తావు లేకండా కేవలం సినిమాలు, ఇండస్ట్రీ, ఇతర హీరోల మంచితనం, కన్నడ భాషల సినిమాలకూ తానిచ్చే ప్రాధాన్యతల గురించి చెప్పడం చాలా బావుంది.
ఇక ఈ మూవీలో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించారు. తమిళ్ స్టార్ యాక్టర్ పార్తీబన్ విలన్ గా నటించాడు. దేవశ్రీ ప్రసాద్ పాటలు, థమన్ నేపథ్య సంగీతం అందించాడు. ఈ మూవీ ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఇది భారీ విజయాన్ని కూడా అందుకోవాలని కూడా ఆకాక్షించాడు పవన్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
