Veera Dheera Shoora : విక్రమ్ టైటిల్ కొట్టేసిన టాలీవుడ్ హీరోలు

Veera Dheera Shoora :   విక్రమ్ టైటిల్ కొట్టేసిన టాలీవుడ్ హీరోలు
X

కొన్ని టైటిల్స్ బలే అనిపిస్తాయి. టైటిల్ చూడగానే ఆకట్టుకుంటుంది. అందుకు తగ్గ కథ, కథనాలు కూడా ఉంటే టైటిలే హైలెట్ గా సినిమాలు విజయం సాధిస్తాయి. అలాంటి టైటిల్ తోనే తమిళ్ స్టార్ తంగలాన్ విక్రమ్ సినిమా వస్తోంది. ఈసినిమా పేరు వీర ధీర శూరన్ 2. అరుణ్ కుమార అనే దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఆ మధ్య విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. అయితే ఇది తమిళ్ మూవీ కాబట్టి తెలుగులో టైటిల్ రిజిస్టర్ చేయడం కుదరదు. అందుకే ఆ టైటిల్ ను మనవాళ్లు పట్టేశారు. విశేషం ఏంటంటే.. మనవాళ్లు తీయబోయే సినిమా ఓ తమిళ్ మూవీకి రీమేక్. ఈ టైటిల్ ఇక్కడ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది కూడా.

రీసెంట్ గా తమిళ్ లో వచ్చిన గరుడన్ మూవీ అక్కడ మంచి విజయం సాధించింది. శశికుమార్, సూరి, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఫ్రెండ్షిప్, ద్రోహం నేపథ్యంలో కంప్లీట్ యాక్షన్ మోడ్ లో సాగుతుంది. అలాగని భారీ ఫైట్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఆరాటాలు కనిపించవు. కథను జెన్యూన్ గా చెప్పాడు దర్శకుడు దురై సెంథిల్ కుమార్. ఈ చిత్రాన్ని తెలుగులో నాంది ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. ఇక్కడ ఆ మూవీకి ‘వీర ధీర శూర’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కేకే రాధా మోహన్ నిర్మించే సినిమా ఇది.

మరి ఇక్కడ నటిస్తున్నది ఎవరో తెలుసు కదా.. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్. ఈ ముగ్గురికీ పర్ఫెక్ట్ గా సరిపోయే టైటిల్ ఇది. పైగా కథకు కూడా యాప్ట్ గా ఉంటుంది. ఇలాంటి పవర్ ఫుల్ టైటిల్ తో సినిమా అంటే తెలుగులో ఎక్స్ పెక్టేషన్స్ కూడా బాగా ఉంటాయి. అందుకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తే మరింత మంచి రిజల్ట్ ను కొట్టొచ్చు.

తెలుగులో మంచు మనోజ్ కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడట. మనోజ్ కొత్త ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకు ఇది పర్ఫెక్ట్ మూవీ అవుతుందనుకోవచ్చు. నారా రోహిత్ మళ్లీ ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సుందరకాండ అనే మూవీ విడుదలుకు రెడీ అవుతోంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ఒకేసారి నాలుగు సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Tags

Next Story