పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. రూ.150 కోట్లని వద్దనుకున్నారు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. రూ.150 కోట్లని వద్దనుకున్నారు..
కానీ మన డార్లింగ్ ప్రభాస్ రూ.150 కోట్ల యాడ్‌ని వద్దని ఒక్కమాటలో చెప్పేసారట.

సినిమా స్టార్లను, సెలబ్రిటీలను తమ బ్రాండ్లకు అంబాసిడర్లుగా చేసుకుంటాయి పేరున్న ప్రముఖ కంపెనీలు. తమ ఉత్పత్తులకు మరింత మార్కెట్ కల్పించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రకటనలు రూపొందిస్తారు. అందుకే సినిమా నటీనటులు, క్రికెటర్లు రెండు చేతులా సంపాదిస్తుంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు ఆఫర్ వస్తే ఆలోచించకుండా ఓకే చెప్పేస్తారు. కానీ మన డార్లింగ్ ప్రభాస్ రూ.150 కోట్ల యాడ్‌ని వద్దని ఒక్కమాటలో చెప్పేసారట.

బాహుబలితో అమాంతం తన బ్రాండ్ ఇమేజ్‌ని పెంచుకుని పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ఆ తరువాత అన్నీ భారీ బడ్జెట్ సినిమాల్లోనే నటిస్తున్నారు. దాంతో అతడు పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ క్రమంలో అతడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అదే సమయంలో కొన్ని యాడ్స్‌‌లో నటించమంటూ ఆఫర్ వచ్చినా, భారీ మొత్తాన్ని ఎరగా వేసినా ప్రభాస్ సున్నితంగా తిరస్కరించారట.

దుస్తులు నుండి ఎలక్ట్రానిక్స్ వస్తువుల వరకు ప్రఖ్యాత బ్రాండ్లు నటుడిని సంప్రదించాయి. 150 కోట్ల కంటే ఎక్కువ విలువైన బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఆఫర్‌ను అతడు తిరస్కరించాడని తెలుస్తోంది. కానీ మన డార్లింగ్ ప్రభాస్ రూ.150 కోట్ల యాడ్‌ని వద్దని ఒక్కమాటలో చెప్పేసారట.ప్రభాస్ ఇంతకు ముందులా కాకుండా ఏదైనా ఉత్పత్తిని ప్రమోట్ చేస్తూ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు అది ప్రజలకు ఎంత వరకు ఉపయోగపడుతుంది అని కూడా ఆలోచిస్తున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలన్నీ వందల కోట్లలో నిర్మిస్తున్నారు. అతడు నటిస్తున్న ఆదిపురుష్ రూ.400 కోట్లతో నిర్మితమవుతుండగా, పఠాన్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో ప్రభాస్ కొత్త చిత్రం 250 కోట్ల ప్రాజెక్ట్. మిషన్ ఇంపాజిబుల్‌తో హాలీవుడ్‌లో ప్రభాస్ ఎంట్రీ ఉంటుందని ఫిల్మ్ వర్గాల టాక్.

Read MoreRead Less
Next Story