Prabhas's Spirit : ప్రభాస్ స్పిరిట్ మూవీ షూటింగ్ క్యాన్సిల్

Prabhass Spirit :  ప్రభాస్ స్పిరిట్ మూవీ షూటింగ్ క్యాన్సిల్
X

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న మూవీ స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. ఈ మూవీపై ఇప్పటికే భారీ క్రేజ్ ఉంది. సందీప్ ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలూ ప్యాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. కాబట్టి ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం గ్యారెంటీ అనుకుంటున్నారు. తృప్తి దిమ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. సమ్మర్ కాబట్టి ప్రభాస్ షూటింగ్స్ కు కొంత బ్రేక్ ఇచ్చాడు. ఆ బ్రేక్ పూర్తి చేసుకుని ఇవాళ్టి నుంచి ప్రభాస్ స్పిరిట్ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతాడు అని చెప్పారు. ఆ మేరకు ఆదివారం సాయంత్రం నుంచే షూటింగ్ స్టార్ట్ చేశాడు సందీప్. మరి ఏమైందో కానీ సడెన్ గా ఈ మూవీ షూటింగ్ క్యాన్సిల్ చేశారు.

నిజానికి స్పిరిట్ మూవీ నైట్ బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ సాగాల్సి ఉంది. ఈ మేరకు కొంపల్లిలో ఓ విల్లాలో చిత్రీకరణ ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి. మరి కారణాలేంటీ అనేది క్లియర్ గా తెలియదు కానీ.. ఈ షూటింగ్ ను ఆపేశారు. ఏదేమైనా ప్రభాస్ ఈ మధ్య చెప్పిన టైమ్ కు చిత్రీకరణకు సహకరించడం లేదు అనే టాక్ కూడా ఉంది. అదేంటీ అంటే అతనో పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ కాబట్టి అందులో ఏ తప్పూ లేదు అంటున్నారు. మరి ఈ మూవీ షూటింగ్ ప్రభాస్ వల్ల ఆగిపోయిందా లేక ఇంకేదైనా కారణాల వల్ల అనేది తెలియదు. అలాగే ఈ మూవీ చెప్పిన టైమ్ కు అంటే 2027 మార్చి 5న విడుదల కావడం లేదు. 2027 డిసెంబర్ లో వస్తుంది అనే టాక్ బలంగా వినిపిస్తోంది.

Tags

Next Story