సినిమా

Manchu Vishnu: మంచు విష్ణు సూపర్ ప్లాన్.. 'గాలి నాగేశ్వరరావు' కోసం ప్రభుదేవా..

Manchu Vishnu: గాలి నాగేశ్వరరావుతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు మంచు విష్ణు..

Manchu Vishnu: మంచు విష్ణు సూపర్ ప్లాన్.. గాలి నాగేశ్వరరావు కోసం ప్రభుదేవా..
X

Manchu Vishnu: హీరోగా ఇప్పటికే సినిమాల నుండి చాలా గ్యాప్ తీసుకున్నాడు మంచు విష్ణు. కొన్నాళ్ల పాటు 'మా' ఎన్నికలతో బిజీగా ఉన్న విష్ణు.. ఫైనల్‌గా తను అనుకున్నది సాధించాడు. మా ప్రెసిడెంట్ అయ్యాడు. ఇక మా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నాళ్లు ఆ కార్యకలాపాలతోనే బిజీ అయిపోయాడు విష్ణు. తాజాగా మరోసారి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. తన అప్‌కమింగ్ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మంచు విష్ణు చివరిగా 'మోసగాళ్లు' అనే చిత్రంలో నటించారు. ఆ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇక దీని తర్వాత తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన 'ఢీ' సినిమాకు సీక్వెల్ 'ఢీ అంటే ఢీ'ను ప్రారంభించాడు. కానీ ఆ సినిమా ఎందుకో ముందుకు వెళ్లలేదు. ప్రస్తుతం ఇషాన్ సూర్య దర్శకత్వంలో 'గాలి నాగేశ్వరరావు' అనే చిత్రంలో నటిస్తున్నాడు విష్ణు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

గాలి నాగేశ్వర రావుతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్స్ అయిన విష్ణు.. క్యాస్టింగ్ దగ్గర నుండి టెక్నిషియన్ల వరకు హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాలో ఓ పాటను కంపోజ్ చేయడానికి ప్రభుదేవాను సెలక్ట్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ పాట చిత్రీకరణ కూడా ప్రారంభమయ్యింది. మరి ఈ సినిమాతో మంచు విష్ణు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES