Godfather : గాడ్‌‌ఫాదర్ కి ప్రభుదేవా స్టెప్స్..!

Godfather : గాడ్‌‌ఫాదర్ కి ప్రభుదేవా స్టెప్స్..!
Godfather : మోహన్‌‌‌రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న మూవీ గాడ్‌‌ఫాదర్... కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి..

Godfather : మోహన్‌‌‌రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న మూవీ గాడ్‌‌ఫాదర్... కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఒక్క రూపాయి రెమ్యునరేషన్ లేకుండా సల్మాన్ ఈ సినిమా చేస్తుండడం విశేషం.

అయితే ఈ సినిమాలో చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌ల కోసం ఓ అద్భుతమైన పాటను కూడా ప్లాన్ చేశాడట డైరెక్టర్.. థమన్ స్వరపరిచిన ఈ స్పెషల్ పాటను ఇండియన్ మైకల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేయనున్నారు.. ఈ విషయాన్ని థమన్ స్వయంగా వెల్లడించాడు.

" మా బాస్ చిరు, సల్మాన్ కాంబినేషన్ లో ఆటమ్ బాంబ్ లాంటి స్వింగింగ్ సాంగ్ కు ప్రభుదేవా కోరియోగ్రఫీ చేయనున్నాడు. ఇది కచ్చితంగా స్క్రీన్ పైన ఫైర్ కానుంది" అని రాసుకొచ్చాడు. కాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' సినిమాకి ఇది రీమేక్.

ఈ మూవీ షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా.. ఇందులో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. సత్యదేవ్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

Tags

Next Story