WOLF Teaser : టీజర్ తోనే భయపెట్టిస్తోన్న ప్రభుదేవా

WOLF Teaser : టీజర్ తోనే భయపెట్టిస్తోన్న ప్రభుదేవా
X
'వుల్ఫ్' టీజర్ రిలీజ్.. కొత్త అవతార్ లో ప్రభుదేవా

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా 60వ చిత్రంగా తెరకెక్కుతోన్న 'వుల్ఫ్' కు వినూ వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. సందేశ్ నాగరాజ్ నిర్మించిన ఈ చిత్రంలో అంజు కురియన్, లక్ష్మీ రాయ్ కథానాయికలుగా నటిస్తున్నారు. భాస్కర్, అనసూయ భరద్వాజ్ లాంటి ప్రముఖ నటులు నటించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

చారిత్రక కాలంలో జరిగిన కథను ఈ సినిమాలో చూపించినట్టు తెలుస్తోంది. దర్శకుడు విను వెంకటేష్ దీన్ని సైన్స్ ఫిక్షన్ కథగా మలిచారు. సినిమా కథ ప్రకారం హీరో, విలన్ ఇద్దరికీ తోడేలు లక్షణాలు ఉంటాయి. వీరిద్దరికీ మధ్య జరిగే పోరాటంలో ఎవరు గెలుస్తారు అన్నదే కథ. అయితే రీసెంట్ గా రిలీజైన టీజర్ ను గమనిస్తే.. అనసూయ భరద్వాజ్ ఎంట్రీతో మొదలవుతుంది. "రేపు నేను ఇంటికి వెళ్లాలి. మన లవ్ గురించి మా ఇంట్లో చెప్పాను. ఇక్కడికి రా మాట్లాడుకుందా అన్నారు" అన్న ఒక్క డైలాగ్ మాత్రమే ఈ టీజర్ లో ఉంది. ఇక ప్రభుదేవా, అనసూయ, రాయ్ లక్ష్మీ పాత్రలు కూడా చాలా వింతగా, కొత్తగా అనిపిస్తున్నాయి. హారర్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోందని టీజర్ ను బట్టి తెలుస్తోంది.

ఈ సినిమాకు అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీకి అమ్రేష్ గణేష్ సంగీతం అందించారు. సందేశ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఇప్పటికే పుదుచ్చేరి, చెన్నై, అండమాన్‌ నికోబార్‌ దీవులు, బెంగుళూరు వంటి ప్రాంతాల్లో 65 రోజుల పాటు వుల్ఫ్‌ చిత్రాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రానికి అంబరీషన్ సంగీత దర్శకుడు. అయితే, మేకర్స్ ఇంకా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించలేదు.

ఇటీవల 'బగీరా' చిత్రంలో కనిపించిన ప్రభుదేవా.. ఇప్పుడు తన రాబోయే ప్రాజెక్ట్లలో భాగంగా రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి 'ముసాసి' కాగా, మరొకటి 'రెక్లా'. దీంతో పాటు ఆయన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్‌తో కలిసి యోగరాజ్ భట్ చిత్రం 'కరటక దమనక(KD)'లో కూడా నటిస్తున్నాడు.


Tags

Next Story