Pradeep Machiraju : పవన్ కళ్యాణ్ టైటిల్ తో ప్రదీప్ మాచిరాజు

Pradeep Machiraju :  పవన్ కళ్యాణ్ టైటిల్ తో ప్రదీప్ మాచిరాజు
X

ఫీమేల్ యాంకర్స్ లో సుమ ఎలాగో.. మేల్ యాంకర్స్ లో ప్రదీప్ మాచిరాజు అలాగా. అద్భుతమైన టైమింగ్ అతని సొంతం. ఎన్నో షోస్ ను తనదైన శైలిలో రక్తి కట్టిస్తూ ఆయా షోస్ టిఆర్పీ పెంచిన క్రేజ్ ఉన్న యాంకర్ అతను. అలాంటి వారి క్రేజ్ ను ఇండస్ట్రీ కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. ఇటు వీళ్లు కూడా తమ ఇమేజ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా ప్రదీప్ హీరోగా కొన్నాళ్ల క్రితం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా వచ్చింది. నీలీ నీలీ ఆకాశం అనే పాటతో అద్భుతమైన ప్రమోషన్స్ తెచ్చుకున్న ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. అయితే కొన్నాళ్లుగా ప్రదీప్ టివి షోస్ లో కూడా కనిపించడం లేదు. దీంతో ఏమైందా అనుకుంటన్న ఫ్యాన్స్ కు ఇదుగో ఇలా సడెన్ గా సర్ ప్రైజ్ ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్ తో ప్రదీప్ తో పాటు మరో యాంకర్ దీపిక పిల్లి హీరోయిన్ గా ఓ సినిమా రూపొందుతోంది. నితిన్- భరత్ ద్వయం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ నిర్మిస్తోంది. రథన్ సంగీతం అందిస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ రివీల్ చేస్తూ ఓ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.


విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రదీప్ స్కూల్ టీచర్ గా నటిస్తున్నట్టు కనిపిస్తోంది. ఊరి జనం అంతా పలుగులు, పారలు, కర్రలు పట్టుకుని ఎవరి మీదకో పోరాటానికి వెళుతున్నట్టుగా ఉన్న మోషన్ నుంచి.. పలుగు పారా వద్దు, పలకా బలపం ముద్దు అనే స్లోగన్ క్లాస్ రూమ్ లో కనిపిస్తుంది. ఆ స్కూల్ నుంచి తను ప్రేమిస్తోన్న అందాల సందమామాకు ఓ సందేశం పంపిస్తున్నట్టుగా ఉన్న ఈ మోషన్ పోస్టర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. చూడగానే ఓ పాజిటివ్ ఫీల్ వచ్చేలా కనిపిస్తోంది. గ్రామీణ అందాలను అద్భుతంగా క్యాప్చర్ చేశారు అన్నట్టుగా ఈ పోస్టర్ లోనే కనిపిస్తోంది. మొత్తంగా దీపిక పిల్లి కూడా చాలాకాలంగా ఓ బ్రేక్ కోసం చూస్తోంది. ఇటు ప్రదీప్ హీరోగా సక్సెస్ కావాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. మరి ఈ ఇద్దరి కోరికా ఈ మూవీ తీరుస్తుందేమో చూడాలి.

Tags

Next Story