Pradeep Machiraju : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ట్రైలర్ ఎలా ఉంది

Pradeep Machiraju :  అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ట్రైలర్ ఎలా ఉంది
X

యాంకర్ నుంచి యాక్టర్ గా మారి హీరోగా టర్న్ తీసుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. యాంకర్ గా అద్భుతమైన టైమింగ్ ఉన్నవాడు అనే పేరుంది. కొన్నాళ్ల క్రితం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీతో హీరోగా మారాడు. కానీ ఆ మూవీ ఆకట్టుకోలేదు. ఇప్పుడు మరోసారి హీరోగా తన లక్ ను చెక్ చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ టైటిల్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో వస్తున్నాడు. నితిన్ - భరత్ ద్వయం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీపికా పిల్లి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.

చిన్నప్పటి నుంచి చదువుల్లో యావరేజ్ అయిన ఓ కుర్రాడు అదే యావరేజ్ మార్క్ లతో సివిల్ ఇంజినీర్ అవుతాడు. తను పనిచేయాల్సింది ఓ చిన్న గ్రామంలో. ఆ ఊరి వారికి ఇతని వర్క్ పట్ల ఎలాంటి అవగాహనా ఉండదు. అందుకే అతన్ని ‘మేస్త్రీ’ అని పిలుస్తుంటారు. పైగా అతన్నే తమకు పని నేర్పించి చేయించుకోమంటారు. మరి అలాంటి మనుషుల మధ్య తను ఎలా నెగ్గుకొచ్చాడు. ఇంతకీ అతను చేయాల్సిన పనేంటీ అనేది ఓ కోణం అయితే.. ఆ ఊరిలో ఒకే ఒక అమ్మాయి ఉంటుంది. పేరు ‘రాజా’. ఈ ఇద్దరూ ప్రేమించుకుంటాడు. ఆమె తండ్రి మాత్రం ఓ అరవైమంది కుర్రాళ్లను చూపించి వీరిలో ఒక్కరిని చేసుకో అంటాడు. మరి ఆ అబ్బాయి, ఈ అమ్మాయిని కలుసుకున్నాడా లేదా అనేది కథ అనేలా ఉంది ట్రైలర్.

చూడ్డానికి మరీ కొత్త కంటెంట్ కాకపోయినా ట్రైలర్ ఆకట్టుకునేలానే కనిపిస్తోంది. ‘మనదేశంలో ఇంజినీరింగ్ చదివినోడు ఒక్క డాక్టర్ పని తప్ప ఏ పనైనా చేయగలడు’ అనే డైలాగ్ చూస్తే ఆ కోణంలో కొన్ని సెటైర్స్ గ్యారెంటీ అనేలా ఉంది. మరి ప్రదీప్ మాచిరాజు ఈ సారి హీరోగా ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

Tags

Next Story