Pradeep Ranganathan : కుర్రాడి ప్లానింగ్ చూస్తే ముచ్చటేస్తోందిగా

కొందరి సక్సెస్ ఎందరికో ఆదర్శం అవుతుంది. సాధించాలన్న తపన, సాధించిన తర్వాత అణకువ.. ఇంకేదో చేయాలన్న నిరంతర కృషి.. ఇవన్నీ ఒక మనిషిని ఎంత ఎత్తుకైనా తీసుకువెళతాయి. కొన్నేళ్ల క్రితం ప్రదీప్ రంగనాథన్ అనే ఓ యంగ్ స్టర్.. సినిమాలు డైరెక్ట్ చేయాలని కలలు కన్నాడు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. అందులో నటించాడు కూడా. ఓ మంచి కథ రాసుకుని కొందరు హీరోలను, ప్రొడక్షన్ హౌస్ లను అప్రోచ్ అయయాడు. అతని వాలకం చూసి నువ్వు సినిమా చేస్తావా అని హేళన చేశారు. ఒక్కరు నమ్మారు. హీరోలు నో చెప్పారు కాబట్టి తనే హీరో అని ఫిక్స్ అయ్యాకే ఆ ప్రొడక్షన్ హౌస్ ను ఒప్పించాడు. అప్పుడూ వెటకారాలే. ఇతని పక్కన హీరోయిన్ గా చేయాలా అంటూ హీరోయిన్లు మొహం చాటేశారు. అయినా పట్టు వదల్లేదు. ఇవాన అనే అమ్మాయి ఓకే చెప్పింది. కట్ చేస్తే అతి చిన్న బడ్జెట్ తో అతనే హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అదే లవ్ టుడే. తెలుగులోనూ డబ్ అయి విజయం సాధించింది. లవ్ టుడేతో ఓవర్ నైట్ ఫేమ్ అయ్యాడు ప్రదీప్ రంగనాథన్.
ఇంకేముందీ.. సక్సెస్ ల చుట్టే తిరిగే పరిశ్రమ కదా. వెంటనే మరో అవకాశం వచ్చింది. ఈ సారి తన ఫ్రెండ్ డైరెక్షన్ లో హీరోగా నటించే ఛాన్స్. ఆ సినిమానే డ్రాగన్. దర్శకుడుగానే కాక నటుడుగానూ ప్రూవ్ చేసుకున్నాడు కదా. అనుపమా పరమేశ్వరన్ లాంటి బ్యూటీ అతని సరసన నటించేందుకు ఓకే చెప్పింది. కయాడు లోహర్ మరో హీరోయిన్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ చిత్రానికీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది తమిళనాడులో. దీంతో ప్రదీప్ ఇమేజ్ తో పాటు రేంజ్ కూడా మారబోతోందని చెప్పొచ్చు. పైగా అతని లైనప్ చూస్తే ముచ్చటేస్తోంది కూడా.
రిటర్న్స్ ఆఫ్ ద డ్రాగన్ తర్వాత లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమాతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో మరో సినిమా ఉంది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకుడు. కృతిశెట్టి హీరోయిన్. ఎస్.జే సూర్య, గౌరి కిషన్ ఇతర పాత్రల్లో నటించబోతున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీ ష్యూర్ షాట్ అంటున్నారు. మైత్రీ బ్యానర్ లో కూడా తమిళ్ దర్శకుడితోనే సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత తన డైరెక్షన్ లో ఓ యాక్షన్ సినిమా చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట.
తన ఫిజిక్ కు యాక్షన్ మూవీ అంటే నమ్ముతారా అంటే.. అప్పట్లో ధనుష్ తనకంటే తక్కువ ఫిజిక్ తో ఉంటూనే యాక్షన్ మూవీస్ చేస్తే ఒప్పుకున్నారు కదా.. ఏదైనా కంటెంట్ లో బలం ఉండాలి అంటున్నాడు. సో.. సూపర్ స్టార్డమ్ వస్తుందో లేదో తెలియదు కానీ.. తన రేంజ్ లోనే కొన్నాళ్ల పాటు రూల్ చేసే సత్త ఉన్న కుర్రాడు అనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.
విశేషం ఏంటంటే.. ఇతని ప్లానింగ్ ఎలా ఉందంటే.. ఫస్ట్ మూవీ నుంచే తెలుగులోనూ అడులుగు వేస్తున్నాడు. ఆకట్టుకుంటున్నాడు. కార్తీ కూడా ఇలాగే చేశాడు. తన ఫస్ట్ మూవీ ఒక్కటి తప్ప మిగతా సినిమాల నుంచి తెలుగులోనే డబ్బింగ్ చెప్పుకుని చాలా తొందరగా మనవారికి దగ్గరయ్యాడు. డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రదీప్ మాట్లాడిన తెలుగు చూస్తే నెక్ట్స్ సినిమాకు అతనే డబ్బింగ్ చెప్పుకున్నా ఆశ్చర్యం లేదు. మరి ఇతనూ కార్తీలా ఇక్కడ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com