Pradeep Ranganathan : ఓటిటిలోకి డ్రాగన్ .. ఎప్పుడంటే

రీసెంట్ గా వచ్చిన తమిళ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ డ్రాగన్ సంచలన విజయం సాధించింది. తమిళ్ లోనే కాక తెలుగులోనూ ఈ చిత్రం కమర్షియల గా సక్సెస్ అయింది. అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. యూత్ ఫుల్ గా ఉన్నా.. ఓ మంచి మెసేజ్ ను కూడా కన్వే చేసిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం మెప్పించింది. ఎక్కడా అసభ్యత, అశ్లీలత లేకుండా.. నీట్ గా కనిపిస్తుంది. చాలామంది యువత ఫస్ట్ హాఫ్ లో తమను తాము చూసుకునేలా ఉన్నా.. తర్వాత అలా ఉండకూడదు అనే ఫీలింగ్ ను బలంగా అందించిందీ సినిమా.
డ్రాగన్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 140కోట్లకు పైగా వసూలు చేసి ఈ యేడాది కోలీవుడ్ లో బిగ్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక ఈ చిత్రం ఓటిటిలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వారికోసమే ఈ వార్త. ఈ చిత్రం ఓటిటిలోకి రాబోతోంది. ఈ నెల 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది డ్రాగన్. సో.. థియేటర్స్ లో చూడని వాళ్లు మాత్రమే కాదు.. చూసిన వాళ్లు కూడా మరోసారి చూసేంత స్టఫ్ ఉన్న మూవీ కాబట్టి ఓటిటిలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com