Pradeep Ranganathan : ప్రదీప్ సినిమా పోస్ట్ పోన్ అయిందా..?

షార్ట్ టైమ్ లో స్టార్ మెటీరియల్ అనిపించుకున్న కుర్రాడు ప్రదీప్ రంగనాథన్. తను డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించిన లవ్ టుడేతో తమిళనాడులోనే కాదు, తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ యేడాది విడుదలైన డ్రాగన్ తో స్టార్ మెటీరియల్ గా మారాడు.అతనిపై ఎంత బడ్జెట్ పెట్టినా రికవర్ అవుతుందన్న నమ్మకం నిర్మాతలకు వచ్చింది. అందుకు కారణం డ్రాగన్ 100 కోట్ల క్లబ్ లో చేరడమే. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ‘డూడ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ యేడాది దీపావళికి విడుదల కాబోతోంది. దీంతో పాటు అతను తమిళ్ లో విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’అనే సినిమా చేస్తున్నాడు. విఘ్నేష్ సొంత బ్యానర్ లో రూపొందుతోన్న చిత్రం ఇది. ప్రదీప్ సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (L.I.K) చిత్రాన్ని ఈ సెప్టెంబర్ 18న విడుదల చేయాలనుకున్నారు. కానీ తాజాగా ఆ డేట్ నుంచి పోస్ట్ పోన్ చేయబోతున్నారని టాక్. కొత్త రిలీజ్ డేట్ గా 2026 వేలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేస్తారని టాక్. అందుకు కారణం.. ఈ యేడాది దీపావళికి అతని డూడ్ మూవీ విడుదల కాబోతోంది. అయితే ముందు ఒప్పుకున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కంటే వెనక ఒప్పుకున్న డూడ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడట ప్రదీప్. ఆ కారణంగా తమిళ్ మూవీ లేట్ అయింది. అందుకే చెప్పిన టైమ్ కు రిలీజ్ చేయడం కుదరడం లేదు అంటున్నారు. ఆ తర్వాత కొత్త డేట్స్ అంటే అన్నీ పెద్ద సినిమాలతో నిండి ఉన్నాయి. సో.. ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి వేలెంటైన్స్ డే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అవుతున్నారట.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com