Pragathi : హీరోయిన్‌‌గా ప్రగతి నటించిన తొలి సినిమా ఏంటో తెలుసా?

Pragathi : హీరోయిన్‌‌గా ప్రగతి నటించిన తొలి సినిమా ఏంటో తెలుసా?
Pragathi : నటి ప్రగతి అంటే బహుశా తెలియని వాళ్ళు ఉండరు.. అమ్మ, అత్త పాత్రలంటే ప్రేక్షకులకి ఆమె గుర్తుకువస్తారు.

Pragathi : నటి ప్రగతి అంటే బహుశా తెలియని వాళ్ళు ఉండరు.. అమ్మ, అత్త పాత్రలంటే ప్రేక్షకులకి ఆమె గుర్తుకువస్తారు.. నేడు(మార్చి 17) ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం... ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో జన్మించిన ప్రగతి చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం చెన్నైలో స్థిరపడింది.

తల్లికి సాయంగా ఉండటం కోసం కార్టూన్ పాత్రలకు గాత్రదానం చేసేది ప్రగతి. చదువుకునే రోజుల్లోనే చెన్నైలో పలు ప్రకటనల్లో నటించింది. ఆమెను చూసిన తమిళ దర్శకుడు కె.భాగ్యరాజ్ తన సినిమా 'వీట్లవిశేశాంగ' సినిమాలో హీరోయిన్‌‌గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలలో ఏడు తమిళ సినిమాలు, ఒక మలాయళం సినిమాలో నటించింది. పెళ్ళయాక సినిమాలకి దూరంగా ఉన్న ప్రగతి.. ఆ తర్వాత టీవీ సీరియళ్ళలో నటించడం మొదలు పెట్టింది.

ఆ తర్వాత మహేష్‌‌బాబు హీరోగా వచ్చిన బాబీ మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్థిరపడిపోయింది. తెలుగులో వందకి పైగా సినిమాల్లో నటించింది. వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఏమైంది ఈవేళ సినిమాలో ఆమె పోషించిన తల్లి పాత్రకు గాను ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం లభించింది.. ఇక కల్యాణ వైభోగమే చిత్రానికి గాను మరో నంది అవార్డు అందుకుంది.

ఈ మధ్య ఆమె సోషల్‌ మీడియాల్లో సైతం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న ప్రగతికి ఒక కుమారుడు ఉన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story