Pragya Jaishwal : సల్మాన్ ఖాన్ సినిమాలో ప్రగ్యా

కంచె (Kanche) సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaishwal). వైవిధ్యమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా.. మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత ప్రగ్యా పలు సినిమాల్లో నటించినప్పటికీ అవేవి పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక సినిమాలో మాత్రమే ఈ అమ్మడు నటిస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.
అయితే ఇంకా ఈ మూవీకి టైటిల్ ఖరారు కాలేదు. బాలయ్య సినిమా సెట్స్ పై ఉండగానే మరో మూవీలో నటించేందుకు ఈ బ్యూటీకి అవకాశం వచ్చింది. అది కూడా బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో సినిమా కావడం విశేషం. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందు తోన్న చిత్రం అంతిమ్. ఇందులో సల్మానాన్ సిక్కు పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. సల్మాన్ కి జోడీగా ప్రగ్యా జైశ్వాల్ నటిస్తోందని వార్తలు వస్తున్నాయి.
ఇక అటు సినిమాల్లో బిజీగా ఉన్న ప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ అంటుంది ప్రగ్యా. దాంతోపాటు ఫ్రెండ్స్ తో వెకేషన్స్ కు వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటుంది. టూర్ సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంటుంది. అప్పుడప్పుడు తన హాట్ ఫొటో షూట్స్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

