Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. ఆఫర్లు లేకున్నా ఆరబోతలో తగ్గేదేలే

Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. ఆఫర్లు లేకున్నా ఆరబోతలో తగ్గేదేలే

‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది మధ్యప్రదేశ్​ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత వరుణ్​ తేజ్ తో ఆమె నటించిన ‘కంచె’సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. కంచె హిట్ తో టాలీవుడ్ లో ప్రగ్యాకు ఆఫర్లు క్యూ కట్టాయి. 'ఓం నమో వేంకటేశాయ', గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయకా, ఆచారి అమెరికా యాత్ర లాంటి సినిమాల్లో ఆమె యాక్ట్ చేసింది. అయితే, ఈ సినిమాలు ఆమెకు సక్సెస్ ను తీసుకురాలేకపోయాయి. 2021లో బాలయ్యకు జోడిగా ఆమె నటించిన ‘అఖండ’మూవీతో ప్రగ్యా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది. అయితే,ఆ తర్వాత నటించిన ఆమె నటించిన ‘సన్ ఆఫ్​ ఇండియా’ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్ లో వస్తున్న మూవీలో ప్రగ్యా జైస్వాల్ ను తీసుకున్నట్లు వార్తలు వచ్చినా మేకర్స్ నుంచి ఎలాంటి అఫిషీయల్ అనౌన్స్ మెంట్ రాలేదు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కూడా ప్రగ్యాకు కాలం కలిసిరావట్లేదు. టాలీవుడ్ లో ఆమె కెరీర్ నత్తనడకగానే సాగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగ్యా జైస్వాల్.. అందాల ఆరబోతతో రచ్చ రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags

Next Story