pragya jaiswal : అఖండ బ్యూటీకి మెగా ఆఫర్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసింది..!
pragya jaiswal : నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం అఖండ.. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టింది ఈ కాంబినేషన్..

నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం అఖండ.. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టింది ఈ కాంబినేషన్.. ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్ళతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి ఆట నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది ఈ చిత్రం.. ఇప్పటికే 2021లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా అఖండ చరిత్ర సృష్టించింది.
ఈ సినిమాలో బాలయ్య సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది కంచే బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.. అయితే ఇప్పుడు ఈ బ్యూటీకి బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో హీరోయిన్ ని ఇంకా ఫిక్స్ చేయలేదు. మొత్తం ఇద్దరు హీరోయిన్ లకి ఈ సినిమాలో స్కోప్ ఉండడంతో ఓ హీరోయిన్ గా ప్రగ్యాని తీసుకున్నారన్న టాక్ నడుస్తోంది.
దీనిపైన త్వరలోనే ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఇదే నిజమైతే ప్రగ్యాకి ఇది ఓ గోల్డెన్ ఛాన్స్ అని చెప్పేయొచ్చు. కాగా ఇప్పటికే మొదలైన ఈ సినిమా షూటింగ్ లో చిరంజీవి కూడా పాల్గొంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.
RELATED STORIES
Karnataka : బీదర్‌లో ఘోరరోడ్డు ప్రమాదం.. చినారి సహా ఆరుగురు మృతి..
15 Aug 2022 4:35 PM GMTHyderabad : గన్‌ఫైరింగ్ చేసి స్టేటస్‌లో పెట్టిన టీఆర్ఎస్ నాయకులు..
15 Aug 2022 3:00 PM GMTMukesh Ambani : ముకేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు..
15 Aug 2022 1:03 PM GMTKapra : కాప్రాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం..
15 Aug 2022 12:00 PM GMTBandi Sanjay : డీజీపీకి బండి సంజయ్ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?
15 Aug 2022 10:00 AM GMTBandi Sanjay : బండి సంజయ్ సభలో ఉద్రిక్తత.. పలువురికి తీవ్ర గాయాలు..
15 Aug 2022 9:45 AM GMT