Pragya Jaiswal : రెమ్యునరేషన్ పెంచిన బాలయ్య హీరోయిన్.. కోటి తక్కువైతే తగ్గేదేలే..!

Pragya Jaiswal : రెమ్యునరేషన్ పెంచిన బాలయ్య హీరోయిన్.. కోటి తక్కువైతే తగ్గేదేలే..!
Pragya Jaiswal : ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్ళు అవుతున్న సరిగ్గా ఒక్క బ్లాక్‌బస్టర్ హిట్ కూడా అందుకోలేకపోయింది హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.

Pragya Jaiswal : ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్ళు అవుతున్న సరిగ్గా ఒక్క బ్లాక్‌బస్టర్ హిట్ కూడా అందుకోలేకపోయింది హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.. 2015లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన కంచె సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది ప్రగ్యా.. మొదటి సినిమాతో మంచి హిట్ అయితే దక్కించుకుంది కానీ.. ఆ తర్వాత అనుకున్నంత అవకాశాలు అయితే ఈ అమ్మడుకి రాలేదు.

తాజాగా సీనియర్ హీరో బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు ఈమెకి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. అఖండ సక్సెస్ తర్వాత కథ, పాత్రల విషయంలో కాస్త స్ట్రిక్ట్ గా ఉంటుందోట ప్రగ్యా..

వెంకటేష్ హీరోగా, తరుణ్ భాస్కర్ కాంబోలో తెరకెక్కబోతున్న ఓ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యాని తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారట.. అయితే దీనికోసం ఆమెను సంప్రదించగా ఏకంగా ఆమె కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తోంది.

కాగా అఖండ సినిమాకి గాను ప్రగ్యా ముప్పై లక్షల రెమ్యునరేషన్ తీసుకుందని ఫిలింనగర్ లో టాక్. ఇప్పుడు ఏకంగా మూడొంతుల రెమ్యునరేషన్ పెంచడం ఇండస్ట్రీ వర్గాలను షాక్ కి గురి చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story