Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌కు మళ్లీ కరోనా.. ఆందోళనలో ఆ సినిమా టీమ్

Pragya Jaiswal: కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడ్డారు. పెద్దగా బయటికి వెళ్లకపోయినా, షూటింగ్లు జరగకపోయినా, కొద్దిపాటి లక్షణాలతోనే ఎందరో నటీనటులు కరోనాతో పోరాడారు. వారిలో ప్రగ్యా జైస్వాల్ కూడా ఒకరు. ఇప్పటికే కరోనాతో ఒకసారి పోరాడిన ప్రగ్యా మరోసారి తాను కోవిడ్ బారిన పడినట్టు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా తనకు కరోనా సోకిందని ప్రగ్యా వెల్లడించింది. అంతే కాక తనకు వైరస్ లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను ఐసోలేషన్‌లో ఉన్నానని, తనతో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్లంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. త్వరలోనే కోలుకొని అందరి ముందుకు వస్తానని వ్యక్తం చేసింది ప్రగ్యా.
ఇదిలా ఉండగా గత కొంతకాలంగా తెలుగుతెరపై కనుమరుగయిపోయిన ప్రగ్యా.. ఇటీవల బాలకృష్ణతో నటించే ఛాన్స్ కొట్టేసింది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను హ్యాట్రిక్ సినిమా అఖండలో ప్రగ్యా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా తన ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసింది మూవీ టీమ్. ఇక ప్రగ్యాకు కరోనా సోకిందన్న విషయాన్ని తెలుసుకున్న అఖండ మూవీ టీమ్‌లో ఆందోళన నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com