Prakash Raj : చంద్రయాన్ 3పై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్రోల్ చేస్తోన్న నెటిజెన్లు

Prakash Raj : చంద్రయాన్ 3పై  ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్రోల్ చేస్తోన్న నెటిజెన్లు
ప్రకాష్ రాజ్ 'ఫస్ట్ పిక్చర్ ఫ్రమ్ మూన్' పోస్ట్‌ను తీవ్రంగా స్పందిస్తోన్న నెటిజన్లు

టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడంతో వివాదంలో చిక్కుకున్నాడు. చొక్కా, లుంగీలో టీ పోస్తున్న వ్యక్తి కార్టూన్ ను పోస్టు చేయడంతో ప్రకాష్ రాజ్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టినట్లుగా నెటిజన్లు భావిస్తున్నారు. చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ప్రకాశ్ రాజ్ పోస్టు ఉండటంతో మండిపడుతున్నారు. "అవమానకరమైన అపహాస్యం" అంటూ సోషల్ మీడియా యూజర్స్ ఈ ట్వీట్ పై కామెంట్లు పెడుతున్నారు.

చంద్రయాన్-3పై వివాదాస్పద ట్వీట్‌

“బ్రేకింగ్ న్యూస్:- #VikramLander Wowww #justasking ద్వారా చంద్రుని నుండి వస్తున్న మొదటి చిత్రం” అనే శీర్షికతో ప్రకాష్ రాజ్ ఇటీవల ఒక చిత్రాన్ని పంచుకున్నారు. ఈ చిత్రం ఇస్రోకు, కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది సోషల్ మీడియా యూజర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. చాలా మంది ట్విటర్ వినియోగదారులు ఈ పోస్టుపై స్పందించారు. అందులో ఒక యూజర్.. “Mr. #PrakashRaj మన శాస్త్రవేత్తలను అవమానిస్తున్నాడు, మన #ISRO ని అపహాస్యం చేస్తున్నాడు. అతన్ని అడగాలి: • అతను ఎవరి కోసం ఇలా చేస్తున్నాడు? • దేని కోసం ఇలా చేస్తున్నాడు? ఇది చాలా సిగ్గుచేటు” అని రాసుకువచ్చాడు. చంద్రయాన్-3 భారతదేశానికి గర్వకారణం. కానీ, ప్రకాశ్ రాజ్ అతని గుడ్డి ద్వేషంకోసం శాస్త్రవేత్తలను ఎగతాళి చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. “నాయకులను ట్రోల్ చేయడం మంచిది, కానీ మన దేశాన్ని ట్రోల్ చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదు…” అని మరొకరు రిప్లై ఇచ్చారు.

ప్రకాష్ రాజ్ వివాదాలు

తన మనసులోని మాటను బయటపెట్టినందుకు ప్రకాష్ రాజ్ ఇబ్బందుల్లో పడటం ఇదేం మొదటిసారి కాదు. ఇటీవల, ప్రకాష్ రాజ్ “సినిమా మాఫియా” పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ వార్తల్లో నిలిచాడు. OTT ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్ పెరిగిన తర్వాత పరిస్థితులు ఎలా మారాయో ఆయన చెప్పుకువచ్చారు.

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. మరికొద్ది గంటల్లో చంద్రుడు దక్షిణ ధ్రువం ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టనుంది. ఈ ప్రక్రియ విజయవంతం అయితే ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఈనెల 23న సాయంత్రం 6.04 గంటల సమయంలో చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ అడుగిడుతుందని ఇస్రో తెలిపింది. రష్యా లూనా-25 ప్రయోగం విఫలం కావడంతో.. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 వైపు చూస్తున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story