'జెండా ఎగరేస్తాం' ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్..
'మా' అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలు హిట్ పెంచుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఒకరిపై ఒకరూ విమర్శలు గుప్పిస్తూ వరుసగా ట్వీట్‌లు చేస్తున్నారు. సెప్టెంబర్‌లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.తాజాగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ వరుస ట్వీట్‌లు ఎన్నికల హీట్ మరింత పెంచుతున్నారు. ఇటీవల షూటింగ్‌లో గాయపడ్డ ప్రకాశ్ రాజ్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.
ఈ క్రమంలో ఇంకా ఆస్పత్రి బెడ్‌పైనే ఉన్న ఆయన తాజాగా 'జెండా ఎగరేస్తాం' అంటూ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అయితే స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఈ ట్విట్ చేశారా? లేదా మా ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ట్విట్ చేశారా అనేది స్పష్టత లేదు.
'మా' ఎన్నికల్లో చురుగ్గా ఉంటూనే సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ధనుష్ చిత్రం షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైయ్యారు. ఈ ప్రమాదంలో ప్రకాశ్ రాజ్ చేతికి బలమైన గాయం కావడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. పది రోజుల క్రితం ప్రకాశ్ రాజ్(Prakash Raj) 'తెగేవరకు లాగొద్దంటూ' చేసిన ట్వీట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com