Tirupati Laddu : తిరుమల లడ్డూ వ్యవహారం.. ప్రకాశ్ రాజ్ vs మంచు విష్ణు

తిరుమల లడ్డూ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. దీనిపై మా అధ్యక్షుడు మంచు విష్ణు రియాక్ట్ కావడం విశేషం. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కోట్ చేస్తూ.. 'మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. దీనిపై విచారించి నేర స్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, జాతీయంగా చర్చించుకునేలా చేస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఘర్షణ లు చాలు (కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు థాంక్యూ' అని ప్రకాశ్ రాజ్ పోస్ట్ పెట్టారు. దీనిపై 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. 'ప్రకాష్ రాజ్.. దయచేసి మీరు మరీ అంతలా నిరుత్సాహపడి, అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నాలాంటి కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తున్నారు. ధర్మ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటారు. ఇలాంటి వ్య వహారంలో మీలాంటి వారు ఉంటే, మతం ఏ రంగు పులుముకుంటుందో? మీ పరిధు ల్లో మీరు ఉండండి'అని పేర్కొన్నారు. మా అధ్యక్ష పదవి కోసం పోటీపడిన ఈ ఇద్దరూ తిరుమల లడ్డూ అంశంపై ఇలా స్పందించడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com