సినిమా

MAA Elections 2021: 'మా' ఎన్నికల పోలింగ్ ఫుటేజీలో ఏముంది..?

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు గెలిచి అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు.

MAA Elections 2021 (tv5news.in)
X

MAA Elections 2021 (tv5news.in)

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు పూర్తయి అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించినా..ఎన్నికల సెగ మాత్రం తగ్గడం లేదు. ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపిస్తున్న ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌.. వీడియో ఫుటేజీ తమకివ్వాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి మూడు రోజుల కిందట లేఖ రాశారు. వీడియా ఫుటేజీ రాగానే అందజేస్తామని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కూడా స్పష్టం చేశారు. ఈ తరుణంలో వీడియో ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్న వార్తలతో కలకలం రేగింది. దీనిని జూబ్లీహిల్స్‌ పోలీసులు ఖండించారు.

మా ఎన్నికల వీడియా ఫుటేజీ తమ వద్ద లేదని జూబ్లీ హిల్స్‌ పోలీసులు స్పష్టం చేశారు. దీనితో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. మా ఎన్నికలు జరిగిన జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ సీసీ కెమెరా సర్వర్‌ రూమ్‌ కు తాము లాక్‌ చేయలేదని సిఐ రాజశేఖర్‌ చెప్పారు. స్కూల్స్‌ కు సెలవులు కావడంతో పాఠశాల యాజమాన్యమే లాక్‌ వేసుకుని వెళ్లిపోయారని పేర్కొన్నారు.

గత వారం హోరాహోరీగా తలపడ్డ మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్‌ విజయం సాధించింది. విష్ణు వందకు పైగా ఓట్లతో ప్రకాశ్‌ రాజ్‌ను ఓడించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను సవాల్‌ చేస్తున్న ప్రకాశ్‌ రాజ్‌... తమ ప్యానెల్‌ నుంచి ఎన్నికైన వారందరి చేత రాజీనామా చేయించారు. స్వయంగా తాను కూడా మా సభ్యత్వాన్ని వదులుకున్నారు. కొత్తగా న్యాయపోరాటం వైపు ప్రకాశ్ రాజ్ అడుగులేస్తున్నట్లుగా సినీ వర్గాల టాక్.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES