Pranitha Subhash : భర్తకు పాదపూజ చేసిన ప్రణీత సుభాష్..

Pranitha Subhash : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రణీత సుభాష్.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. తన భర్తకు పాదపూజ చేసిన ఫోటోను ఇస్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనిపై కొంత మంది నెగటివ్‌గా కామెంట్ చేశారు. నువ్వింకా ఏ కాలంలో ఉన్నావంటూ మరికొందరు ఆమె చర్యలను తప్పు పట్టారు. అయితే ఈ నెగటివ్ కామెంట్స్ గురించి తానేమాత్రం పట్టించుకోనని, ఇది తమ కుటుంబంలో సంప్రదాయంగా వస్తున్న ఆచారమని ప్రణీత వివరించింది.
ఏదైనా ఓ సంఘటనకు రెండు రకాలు ఒపీనియన్స్ ఉంటాయి. వాటిలో 90 శాతం మంది పాజిటివ్‌గా స్పందిస్తే, మిగిలిన 10 శాతం మంది నెగెటివ్ ఒపీనియన్‌తో ఉంటారు. అలాంటివారిని తాను పట్టించుకోనన్నారు. ఆచార సంప్రదాయల మధ్య పెరిగిన వాళ్లకు ఇలాంటి విషయాలు తప్పుగా అనిపించవు.
కాగా, ప్రణీత నితిన్ రాజును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే వారికో పండంటి పాపాయి పుట్టింది. తన కూతురు పేరు ఆర్న అని చిన్నారికి పెట్టిన పేరును అభిమానులతో పంచుకుంది ప్రణీత. ఇకపోతే తన భర్తకు చేసిన పాదపూజను భీమ పూజ అంటారు అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com