Pranitha Subhash: 'అది చూసి నేను, నా భర్త కన్నీళ్లు పెట్టుకున్నాం': ప్రణీత

Pranitha Subhash (tv5news.in)
Pranitha Subhash: కొన్ని సినిమాలు మనసుకు హత్తుకుపోయేలా ఉంటాయి. అది ఒక అబద్ధం అని మర్చిపోయి.. సినిమా చూసి అందులో లీనమయ్యే వారికి అది ఒక ఎమోషన్‌గా మారిపోతుంది. ఓ సినిమాను చూస్తూ.. తెలియకుండానే కన్నీళ్లు పెట్టేసుకునేవారు కూడా ఉంటారు. అలాగే తాను, తన భర్త ఓ సినిమా చూసి ఏడ్చేశామంటూ ప్రణీత సుభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చింది.
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. స్టార్ల సరసన నటించింది ప్రణీత సుభాష్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో చేసిన 'అత్తారింటికి దారేది' తనకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. కొన్నాళ్లు సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా వెలిగిపోయిన తను.. ప్రస్తుతం కనుమరుగయిపోయింది. ఇటీవల తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని పూర్తిగా ఇంటికే పరిమితమయిపోయింది.
తాజాగా విడుదలయిన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా విశేష స్పందన లభిస్తోంది. ప్రతీ ఒక్కరు ఈ సినిమా బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ప్రణీత, తన భర్తతో కలిసి ఇటీవల ఈ సినిమా చూసిందట. చూసిన తర్వాత తనకు ఎలా అనిపించిందో అందరితో పంచుకోవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది ప్రణీత.
'30 ఏళ్లు కశ్మీర్ పండితులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నారో అన్న నిజాన్ని తెలుసుకోవాలంటే ది కశ్మీర్ ఫైల్స్ చూడాల్సిందే. ఇది ప్రతీ భారతీయుడు చూడాల్సిన చిత్రం. సినిమా పూర్తయ్యే సమయానికి నేను, నా భర్త కన్నీళ్లు పెట్టుకున్నాం. మీరు ఇంకా ఈ సినిమా చూడకపోతే చూసేయండి' అంటూ ప్రణీత పెట్టిన పోస్ట్‌తో తనకు ఈ సినిమా ఎంత నచ్చిందో అర్థమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com